మహిళల కోసం ' పింక్‌ పార్కింగ్‌ '

16:11 - February 9, 2019

ఇప్పటి వరకూ బస్సుల్లో, ట్రైన్స్‌లో మనం స్త్రీలకు ప్రత్యేక సీట్లను చూసుంటాం. ఇక ఇప్పుడు పార్కింగ్‌ కూడా ప్రత్యేకం అయినది. ఇది నిజమేనండీ..వివరాల్లోకి వెలితే... చెన్నైలో కొత్తగా ప్రారంభమైన ఈవీసీ కార్నివాల్ సినిమాస్ మల్టీప్లెక్స్ యాజమాన్యం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఆకట్టుకునేందుకు ‘పింక్ పార్కింగ్’ పేరిట మల్టిపెక్స్ పార్కింగ్ స్థలంలో మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. అంటే వారికి పార్కింగ్ స్థలంలో కొంత ఏరియాను కేటాయించారు. దేశంలోనే తొలిసారిగా మహిళలు వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు వీలుగా పార్కింగ్ స్థలంలో కొంత ఏరియాను కేటాయించడంపై హర్షం వ్యక్తం అవుతోంది. ఏదిఏమైనా వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్న మహిళలకు ఈవీసీ కార్నివాల్ సినిమాస్ మల్టీపెక్స్ తీసుకున్న నిర్ణయం మేలు చేస్తుందనడం సందేహం లేదు. ఇదేవిధంగా అన్ని మల్లిపెక్స్ యజమానులు పింక్ పార్కింగ్ చర్యలు తీసుకుంటే కొంతమేరకు మహిళలకు ఇబ్బందులు తొలుగుతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.