ఆరేళ్ళ చిన్నారిని నరికి చంపిన మేనత్త: మెడనరికి రక్తం తాగింది..(?)

15:05 - February 13, 2019

*తమ్ముడి భార్యపై కక్ష తో చిన్నారి హత్య 

*విశాఖ మన్యంలో  దారుణ సంఘటన

*ఆ పసిదాని రక్తం తాగిందని ప్రచారం

 

 

సరిగా లేని మానసిక స్థితి, భర్త తో గొడవలు అన్ని రకాలుగా ఆమెని కౄరురాలిగా మార్చేసాయి. పసిపాపని మెడనరికి చంపేటంత దారుణానికి పాల్పడింది.  ఈ దారుణ సంఘటన విశాఖ మన్యంలోని పెదబయలు మండలం లకేయుపుట్టులో మంగళవారం జరిగింది. 

 లక్ష్మీపేట పంచాయతీ కప్పాడు గ్రామానికి చెందిన వంతాల రస్మోకు, లక్ష్మిపేట పంచాయతీ కప్పాడ గ్రామానికి చెందిన చిరంజీవితో గతంలో పెళ్లయ్యింది. అతడ్ని వదిలేసి రెండు నెలల క్రితం రస్మో లకేయిపుట్టులోని పుట్టింటికి వచ్చేసింది. అయితే నాలుగు రోజుల నుంచి ఆమె తమ్ముడి భార్య చిన్నమ్మి, ఇతర కుటుంబసభ్యులు అత్తగారింటికి వెళ్లిపోవాలని చెప్పే క్రమంలో కుటుంబసభ్యుల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. దీంతో వంతాల రస్మో తమ్ముడి భార్యపై కక్ష పెంచుకున్నది.

ఆ కోపంతోనే మంగళవారం ఉదయం తమ్ముడి కుమార్తె .తన తమ్ముడు సుందరరావు కుమార్తెలు అను (6), సంధ్య (4)లను మంగళవారం ఉదయం కట్టెల కోసమని సమీపంలోని కొండ ప్రాంతానికి తీసుకువెళ్లింది. అక్కడ తన వెంట తీసుకువెళ్లిన కత్తితో అను మెడ కోసి హతమార్చింది. అను చెల్లెలు సంధ్య పరుగున వచ్చి విషయం గ్రామస్థులకు తెలిపింది. గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికే అను ప్రాణాలు కోల్పోయింది. నిందితురాలు రస్మోను గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

 అయితే అనుని హతమార్చిన తర్వాత రస్మో ఆ పసిదాని రక్తం తాగిందని ప్రచారం జరుగుతున్నా ఆలా జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని పాడేరు సీఐ అప్పలనాయుడు అన్నారు. రస్మో తన మరదలు అయిన చిన్నమ్మిపై వున్న కక్షతో ఆమె కుమార్తె అనును కత్తితో నరికి హతమార్చిందని, బాలికను అతి దారుణంగా హత్య చేసిన ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు.