"పాకిస్థాన్ జిందాబాద్" నినాదాలతో ఉలిక్కి పడ్డ ఇండియా గేట్

11:57 - January 14, 2019

నిత్యం పర్యాటకులతో కిటకిటలాడే ఇండియా గేట్ వద్ద ఓ మహిళ అందరినీ భయబ్రాంతులకు గురిచేసింది. ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు చేస్తూ.. అమర జవాన్ జ్యోతిపై చెప్పు విసిరింది. దీంతో అక్కడే ఉన్న మహిళా పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అక్కడే సైనికాధికారులు కూడా ఉన్నారు. వారిని పక్కకు నెట్టి, అమర జవాన్ జ్యోతి వద్ద ఉన్న పూల కుండీలను పగలగొట్టేందుకు ప్రయత్నించింది. 

ఇదంతా అక్కడే ఉన్న ఓ పర్యాటకుడు తన మొబైల్ లో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. మానసిక స్ధితి సరిగా లేని ఆ మహిళా సుల్తాన ఖాన్ గా గుర్తించామని తెలిపారు. ఆమె తన వివరాలు ఏమీ చెప్పడంలేదని, వారి కుటుంబసభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఆ మహిళను సుల్తాన ఖాన్‌ (50)గా గుర్తించారు. ఈ ఘటన తర్వాత పోలీసులు సుల్తాన ఖాన్ వివరాలు తెలుసుకుని ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నించారు. అయితే, ఆమె తన వివరాలేవీ చెప్పడం లేదు. ఆమె మానసిక స్థితి సరిగా లేదని, అందుకే ఆమె ఆ చర్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు.