వివేకా హత్య కేసు: 18 యువకులు అదుపులోకి, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులు కూడా

10:01 - March 25, 2019

*వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ 

*పోలీసుల అదుపులో ఇస్లాంపురకి చెందిన 18 యువకులు ?

*ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులు కూడా ఉన్నారు 

 

 

వైసీపీ నేత, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆధారాల కోసం సిట్ బృందం దర్యాప్తు కొనసాగుతోంది. . మాజీ ఎంపీగా మాజీ మంత్రిగా మాజీ ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్సీగా పనిచేసిన వివేకా హత్య ఇప్పుడు ఎన్నికల వేల మరింత ముఖ్యమైన కేసుగా మారింది.  ఈ కేసులో ఇప్పటికే కీలక సాక్ష్యాలు లభించినట్టు విశ్వసనీయవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కేసులో అనుమానితులుగా భావిస్తోన్నవారి బ్యాంకు ఖాతాలపై దృష్టి సారించిన అధికారులు వాటి లావాదేవీలపై ఆరా తీసినట్లు సమాచారం.  ఈ హత్య కేసులో మరో 18 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీకి అనుకూలంగా వ్వవహరిస్తున్న ఏపీ పోలీసుల ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగితే.. తమకు న్యాయం జరగదని అటు వైఎస్ జగన్ తో పాటు వివేకా కూతురు డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలో విచారణ పూర్తి కాకుండానే హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఐగా ఉన్న శంకరయ్యను ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో కేసుపై తనకు ఉన్న అనుమానాలను వ్యక్తం చేస్తూనే.. సీఐ కేంద్రంగానే కుట్ర జరిగిందా? అన్న కోణంలోనూ వైఎస్ సునీత సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ మధ్యనే వివేకా కూత్రు సునిత వ్యక్తం చేసిన అనుమానాలూ కొన్ని ఉన్నాయి. 

"సంఘటనా స్థలంలో సీఐ శంకరయ్య ఉన్నారు.. అయినా మేము హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత కేసు పెట్టమని చెప్పాల్సి వచ్చింది. అది హత్య అని సీన్ లో లేని మాకు అనుమానం వస్తోంది. సీన్ లో ఉన్న ఆయనకు మేము చెప్పాల్సి వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఆయన ఏదన్నా కవర్ చేయాలని ప్రయత్నించాడా?. ఎందుకు అతను అలా ప్రవర్తించాడు?. ఆయన సమక్షంలోనే మృతదేహాన్ని తరలించారు. కట్లు కూడా కట్టారు. సీఐకి తెలియదా అది తప్పు అని. పంచనామా జరగకుండా మృతదేహాన్ని తరలిస్తుంటే సీఐ ఏమి చేశారు.  ఆయన కూడా ఈ క్రైమ్ లో ఏమైనా భాగస్వామ్యులా?. ఆయనకు ఎవరైనా ఆదేశాలు ఇచ్చారా?. ఈ నేరాన్ని తారుమారు చేయడానికి ఆయన పైన ఎవరున్నారు?. లేదా ఆయనే నేరుగా దీనిలో ఉన్నారా? నాకైతే అనుమానాలు వస్తున్నాయి" అంటూ సందేహాలు వ్యక్తం చేసిన వైఎస్ సునిత అనుమానం లోనూ నిజం ఉందనే అనిపిస్తోంది

 ఇదిలా ఉండగా వివేకా హత్య కేసుకు సంబంధించి తాజాగా మరి కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. పులివెందులలోని ఇస్లాంపుర వీధికి చెందిన 18 యువకులను శనివారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని కడపకు తరలించారు. వీరిలో ఇంజినీరింగ్, డిగ్రీ చదువుతోన్న విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. ఇందులో కిరణ్‌ అనే యువకుడు ప్రస్తుతం డిగ్రీ పరీక్షలు రాస్తున్నట్టు భోగట్టా. వివేకా హత్యతో ఈ యువకులకు ఉన్న సంబంధం ఏంటనేది చర్చనీయాంశమైంది. 

అయితే, వివేకానందరెడ్డి హత్యతో తమ పిల్లలకు సంబంధం లేదని, విచారణకు పంపిందుకు సిద్ధంగా ఉన్నామని ఆ యువకుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐకి వినతిపత్రం సమర్పించారు. డిసెంబరు 2017లో రఫీ అనే యువకుడు హత్య కేసులోనూ ఇస్లాంపురలోని 18 మంది యువకులపై అన్యాయంగా కేసులు బనాయించారని వాపోయారు. అప్పటి నుంచి పులివెందులలో ఏ ఘటన జరిగినా ఇస్లాంపుర యువకులను తీసుకెళ్లి విచారిస్తున్నారని, ఈసారికూడా వాళ్ళని తీసుకు వెళ్ళారని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయేమోనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. . త్వరలో ఈ కేసు ఒక కొలిక్కి రావచ్చనే ఎదురు చూస్తున్నారంతా...