సంక్రాంతి బరిలో ' విశ్వాసం '

17:18 - January 4, 2019

తమిళనాట అజిత్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. మాస్ ఆడియన్స్ లో ఆయనకి ఏ స్థాయి ఇమేజ్ ఉందో .. ఫ్యామిలీ ఆడియన్స్ లోను ఆయనకి అంతే ఇమేజ్ ఉండటం విశేషం. ఆయన హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన 'విశ్వాసం' తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని 'యు' సర్టిఫికేట్ ను తెచ్చుకుంది. సంక్రాంతి బరిలోకి దిగడానికి సిద్ధమైపోతోంది. జనవరి 10వ తేదీన ఈ సినిమాను అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు.  ఇదే రోజున తమిళంలో రజనీ మూవీ 'పేట' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుండటంతో, అంచనాలు భారీగానే వున్నాయి. ఈ రెండు సినిమాలు ఒకే రోజున థియేటర్లకు వస్తుండటం కోలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.  ' విశ్వాసం 'లో నయనతార కథానాయికగా నటిస్తుండటంతో అంచనాలు మరింతగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.