తమిళ రాకర్స్‌ శృతిమించి పోతున్నారు: విశాల్‌

13:25 - February 6, 2019

ఆన్ లైన్ లో రెగ్యులర్ గా కొత్త సినిమాలు డౌన్ లోడ్ చేసుకుని చూసే వాళ్ళకు తమిళ్ రాకర్స్ పేరు సుపరిచితం.  లేటెస్ట్ మూవీ ఏది విడుదలైనా బాషా భేదం లేకుండా సాయంత్రం లోపే అప్ లోడ్ చేసి పెట్టడం వీళ్ళ ప్రత్యేకత. తాజాగా వీళ్ళ గురించి మరోసారి స్పందించాడు విశాల్. తమిళనాడు ప్రభుత్వం తలుచుకుంటే తమిళ రాకర్స్ అంతు చూడగలరని తాను దైవంగా భావించే ప్రభుత్వం ఏదో ఒక రోజు ఇది చేసి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేసాడు.ఇళయరాజా ఈవెంట్ విజయవంతం కావడం పట్ల థాంక్స్ చెప్పేందుకు సిఎం పళనిస్వామిని కలిసిన విశాల్ ఆ తర్వాత ఈ వ్యాఖ్యలు చేసాడు. తమిళ్ రాకర్స్ శృతి మించి పోతున్నారని అందరూ బాధితులుగా ఉన్నామని ఈ వ్యవస్థ నిర్వీర్యం కావాలి అంటే ఒక్క గవర్నమెంట్ వల్లే సాధ్యమని తేల్చి చెప్పాడు. అయితే విశాల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు కాని సర్కార్ ఎంతమేరకు స్పందిస్తుంది అన్నది అనుమానమే. విశాల్ చాలా సార్లు తనవే కాదు కొత్త సినిమాలు ఏవి విడుదలైనా పైరసీని అణిచేందుకు చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. డివిడిల ట్రెండ్ వెళ్ళిపోయి ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్స్ లో సినిమాలు చూసే ట్రెండ్ నడుస్తోంది కాబట్టి పైరసీ భూతాన్ని పట్టుకోవడం ఇంకా కష్టమైంది. ఇప్పుడు ఈ విశాల్ కామెంట్స్ పట్ల అజ్ఞాతంలో ఆపరేట్ చేసె తమిళ్ రాకర్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.