వినయ విదేయ రామా (రివ్యు& రేటింగ్)

12:08 - January 11, 2019

పోయిన సంవత్సరం రంగస్థలం తో హిట్ కొట్టిన రామ్ చరణ్, జయ జానకీ నాయకా లాంటి ఫ్లాప్ సినిమా ఇచ్చిన బోయపాటి. ఇద్దరూ ఈసంవత్సరం కలిసి వచ్చారు.తొలిసారి బోయపాటి, చరణ్ కాంబో లో వస్తున్న సినిమా కావ్టం, ట్రైలర్ లో కనిపించిన యాక్షన్ సీన్స్ మాస్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చేయటం సినిమా మీద మంచి బజ్జ్ తెచ్చాయి. రంగస్థలం లాంటి హిట్ తర్వాత వస్తున్న మూవీ కావడం, మాస్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘వినయ విధేయ రామ’గా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. బిజినెస్ కూడా దానికి తగ్గట్టే భారీగా జరిగింది. ట్రైలర్, అదిరిపోవడంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూశారు. సంక్రాంతి కానుకగా నేడు(జనవరి 11) వినయ విధేయ రాముడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈసినిమా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే ఉందా? రంగస్థలం తో రామ్ చరణ్ తెచ్చుకున్న హైప్ ని ఈ సినిమా నిల బెడుతుందా? జయ జానకి నాయకా లాంటి సినిమాని ఇచ్చిన బోయపాటి ఈ సినిమాతో అయినా సక్సెస్ లొకి వస్తాడా? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే రివ్యూ చూడాల్సిందే... 

కథ
అనాథలైన నలుగురు అన్నదమ్ములకి రైల్వేట్రాక్ మీద దొరుకుతాడు రామ్ (రామ్ చరణ్) ఆ పసివాన్ని తెచ్చుకొని తమతో పాటే పెంచుకుంటారు. అన్న‌ద‌మ్ములంతా పెరిగి పెద్ద వాళ్ల‌యి బాధ్య‌తాయుత‌మైన ఉద్యోగాల్లో సెటిల‌వుతారు. అంద‌రిలో చిన్న‌వాడైన రామ్ కొణిదెల త‌ప్ప. మిగతావాళ్ళు ఉధ్యోగాలు చేస్తూంటే తన అన్నలకి ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించే పనిలో బిజీగా తిరుగుతూంటాడు రామ్.  పెద్దన్న  భువన్ కుమార్IAS(ప్రశాంత్)  ఎలక్షన్ కమీషనర్ గా జాబ్ చేస్తూంటాడు. ఎలాంటి క్లిష్టమైన పరిస్దితుల్లో అయినా  అవినీతి జరగకుండా ఎలక్షన్స్ జరిపించటంలో అతనికి మంచి పేరు ఉంటుంది.  ఈ క్రమంలో అతనికి వైజాగ్ నుంచి బీహార్ దాకా శత్రువులు ఏర్పడతారు. ఈ శత్రువులనుంచి అన్నను కాపాడటమే తన భాధ్యతగా బతుకుతుంటాడు. ప్ర‌శాంత్ ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్. వృత్తి బాధ్య‌తలో ఎంత‌కైనా ఎదురెళ్లే త‌త్వం ఉన్న‌వాడు కాబట్టి విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా విల‌న్ పందెం పరశురాం (ముఖేష్ రిషీ)కి ఎదురెళ్లాల్సి వ‌స్తుంది. ఎలాగూ తప్పదు కాబట్టి అన్నకోసం రామ్ బ‌రిలో దిగి ఫైట్ చేస్తాడు. ముఖేష్ బెదిరింపుల‌కు లొంగ‌కుండా రామ్ కొ.ణి.దె.ల అంటూ అతన్ని ఎదిరిస్తాడు. భువన్ కుమార్ వల్ల,రామ్ వల్ల చావు దెబ్బ తిని ఉంటాడు. ఆ క్ర‌మంలోనే అన్న ప్ర‌శాంత్ విధినిర్వ‌హ‌ణ‌లో భాగంగా బీహార్‌కి షిఫ్ట‌వుతాడు. అయినా పందెం పరశురాం భువన్ కుమార్ ని,అతని ఫ్యామిలీని, ముఖ్యంగా రామ్ ని చంపేసేందుకు స్కెచ్ వేస్తాడు.  ఇంకాసేపట్లో మొత్తం ఫ్యామిలీ చనిపోతారనగా ఊహించని విదంగా బీహార్ సీఎం వచ్చి వాళ్ల నుంచి రామ్ ని,ఫ్యామిలీని సేవ్ చేసి నువ్వు దేవుడివి అన్నట్టుగా రాం చరణ్ ని ఆకాశానికెత్తుతాడు. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ లో బీహార్ లో ఉన్న భువన్ కుమార్ కోసం ఏం చేసాడో చెబుతాడు.ఆ ఫ్లాష్ బ్యాక్ లో బీహార్ లో మృగంలాంటి  గ్యాంగస్టర్ రాజూ భాయ్ (వివేక్ ఒబరాయ్) ఒకడుంటాడు. వాడు నరరూప రాక్షసుడు. అక్కడ  ఎలక్షన్స్ జరగనివ్వడు. సీఎం ని కూడా లెక్క చెయ్యడు. సైన్యం తో వచ్చిన ఎలక్షన్స్ కమీషనర్   భువన్ కుమార్ మీదా ఎటాక్ చేస్తాడు. అప్పుడు భువన్ కుమార్ కోరికపై రామ్ రంగంలోకి దిగుతాడు. రాజుభాయ్ సామ్రాజ్యాన్ని మొత్తం దాదాపు నేలమట్టం చేస్తాడు. ఇలా ఆ ఫ్లాష్ బ్యాక్ చివరలో  ఆ ఫ్యామిలీ మొత్తం ఊహించని ఒక దారుణమైన సంఘటననీ చెబుతాడు. ఆతరవాత మహా క్రూరుడైన రాజూ భాయ్  నుంచి త‌న కుటుంబాన్ని ర‌క్షించుకునేందుకు రామ్ కొణిదెల ఎలాంటి పోరాటం సాగించాడ‌న్న‌దే బ్యాలెన్స్ స్టోరి. ఆ స్టోరీని మాత్రం తెరమీద చూడాల్సిందే... 

విశ్లేషణ

యాక్షన్ ఫార్ములా అనగానే హీరో రక్తాన్ని స్క్రీన్ నిండా పారించాల్సిందే అభిప్రాయం ఏమాత్రం తగ్గకుండా తలలు ఎగరగొట్టటమే తెలుగు హీరో పని అన్నట్టుగా ఫిక్సైపోయాడు బోయపాటి.తెలుగు సినిమా కథలో యాక్షన్ సన్నివేశాలు ఉండాలి కానీ యాక్షన్ సన్నివేశాలకోసమే సినిమా ఉంటే ఎలా? సినిమా తీయాలనుకోగానే కథకంటే ముందు కొత్తరకం ఆయుధాలు ఎలా డిజైన్ చేయాలి అని ఆలొచించటం కాస్త తగ్గిస్తే బెటరేమో. నిజానికి "రంగస్థలం" కోసం రామ్ చరణ్ విపరీతంగా కష్టపడ్డాడు. నటనలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం లో సక్సెస్ అయ్యాడు. అలాంటి హీరోని మళ్ళీ "మామూలు కమర్షియల్" హీరోగా మార్చేసింది "వినయ విధేయ రామా" . రొటీన్ కథనే తన పద్దతిలో మళ్ళీ చూపించాడు బోయపాటి. మొదటి మైనస్ కథే, బోయపాటి సినిమాల్లో ఎప్పట్లాగే ఉన్నట్టు ఈ సినిమాలో కూడా కథలో పెద్ద కొత్తదనం కనిపించదు.టీజర్లో చూపించిన రామ్ కో..ణి..దె..ల ఎపిసోడ్ మరియు ఇంటర్వెల్ బ్లాక్ ఎపిసోడ్ లు మాత్రం ఫస్టాఫ్ అంతటికి హైలైట్ గా నిలుస్తాయి.ఇక కామెడీ ఏదో పరవాలేదన్నుట్టుగా తప్ప మరీ ఆకట్టుకోలేదు,ఇక పాటల విషయానికి వస్తే దేవిశ్రీ  ఒక్క పాట మినహా అంతగా ప్రభావం చూపలేదు.నిజానికి రామ్ చరణ్ డ్యాన్స్ మెరుగ్గా ఉండటం వల్ల కాస్త చూడగలం. దేవీ శ్రీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సో సో. ఇక హీరోయిన్ పాత్ర "నామ్ కే వాస్తే" అన్నట్టుగా ఉంటుంది. 
    హీరో విలన్ మధ్య ఉండాల్సిన చేజింగ్ మిస్సయ్యింది. మొదటిసారి దేబ్బకి కోమాలోకి వెళ్ళిన విలన్ మళ్ళీ లాస్ట్ ఫైట్లోనే హీరోకి ఎదురు పడి చచ్చిపోతాడు. ఇంతే తప్ప ఇద్దరి మధ్యా ఎటాక్ లూ, రిటార్ట్ లూ వార్నింగులూ.. లాంటి ఎపిసోడ్ ఏమీ ఉండదు. రెండుసార్లే హీరో విలన్ ఎదురుపడతారు. 
    అసలు పందెం పరశురాం భారీ ఎటాక్ తర్వాత మళ్ళీ కనిపించడు. అసలా పాత్ర ఏమైందో కూడా చెప్పరు. కేవలం సినిమాలో కొంత యాక్షన్ మూడ్ మెయింటెయిన్ చెయ్యటానికే అంత పెద్ద పాత్రని వాడాలా అనిపించక మానదు. నిజానికి సెకండాఫ్ మొత్తం కలిపి క్లైమాక్స్ అనుకోవాలి. రామ్ చరణ్ డాన్స్ స్టెప్పులతో ఆ పాటలు వినడానికన్నా చూస్తేనే పర్వాలేదనిపిస్తాయి.సెంటిమెంట్ ని ఇష్ట పడే ప్రేక్షకులకి సినిమా మాత్రం సెకండాఫ్ కన్నా ఫస్టాపే బాగున్నట్టు అనిపిస్తుంది.

నటీ నటులు: 
నిజానికి ఈ సినిమాకోసం రామ్ చరణ్ పడ్డ కష్టం మొత్తం ప్రతీ కదలికలోనూ కనిపిస్తుంది. కథ లేని సినిమా కావటం వల్ల మొత్తం సినిమాని తానే మోయాల్సి వచ్చింది. ఖచ్చితంగ రామ్ చరణ్ మాత్రమే ఈ సినిమాకి ప్లస్. నటి స్నేహ, ప్రశాంత్ వారి నటనతో ఆకట్టుకుంటారు.చరణ్,  విలన్ వివేక్ ఓబెరాయ్ ల మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు,పోస్టర్లలో చూపించిన  చరణ్ సిక్స్ ప్యాక్ బాడీ తో ఫైట్ ఎపిసోడ్, క్లైమాక్స్ సెకండాఫ్ కు హైలైట్ అని చెప్పొచ్చు.
టెక్నీషియన్స్:
బోయపాటి తనదైన మార్క్ మాస్ నేటివిటీని చూపుతారు కానీ మిగతా అంశాల్లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యారనే చెప్పాలి. టెక్నిక‌ల్ గా అద్బుతమైన విజువల్ ప్రయోగం అనుకోవాలి. సినిమాటోగ్రఫీ  సినిమాకి పెద్ద ప్ల‌స్.అయితే కేవ‌లం యాక్ష‌న్ స‌న్నివేశాలు, భారీ పంచ్ డైలాగ్స్ తో తో మత్రమే సినిమా తీసెయ్యాలనే ఆలోచన నుంచి బోయ‌పాటి ఇక‌నైనా బ‌య‌ట‌ప‌డి క‌థ‌పై శ్ర‌ద్ధ పెట్టాల‌ని ఈ సినిమా ప్రూవ్ చేసింది. కథ విషయం లో మెగా ఫ్యాన్స్ నిరాశ చెందక తప్పదు. 
ప్లస్ పాయింట్స్
రామ్ చరణ్ 
ఇంటర్వెల్ బ్యాంగ్
క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ 
మైనస్ :
కథ
దర్షకుడు
ఒక్క మాటలో... సినిమా అంటే హీరో చేసే ఫైట్స్ మాత్రమే కాదు, కథ కూడా ఉండాలి 
రేటింగ్: 2.5/5