బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన "వినయ విధేయ.." : నమ్మటం లేదా లెక్కలు చూడండి

13:37 - January 12, 2019

టాలీవుడ్ నే కాదు మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలాచేసిన సినిమా బాహుబలి. రెండు భాగాల ఈ  సీరీస్  భారతీయ కమర్షియల్ సినిమా రేంజ్ ఏమిటో ప్రపంచం మొత్తానికీ చూపించింది. ఆ సినిమాలు వచ్చినదగ్గరినుంచీ టాలీవుడ్ ని బీట్ చేయాలని అంతా ట్రై చేయటం మొదలు పెట్టారు. ముందుగా తమిళ్ లో "పులి" అనే సినిమా తీసి దారుణంగా దెబ్బతిన్నక. సంఘ మిత్ర అనే సినిమాని కూడా వందలకోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేసారు. ఇక బాలీవుడ్ కూడా తనవంతుగా అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ వంటి టాప్ స్టార్లని దించి మరీ "థగ్స్ ఆఫ్ హిందుస్థాన్" లాంటి భారీ ప్రయోగం చేసి దారుణంగా చతికిల బడిందింది. 

అయితే ఇప్పుడు అలాంతి బాహుబలి రికార్ద్ ని ఒక సినిమా బద్దలు కొట్టింది. అదీ తాలీవుద్ నుంచే నమ్మలేకపోతున్నారా? అవును మరీ ఆ సినిమా పేరు వింటే మరింత షాక్ తింటారు. ఆ సినిమా  తాజాగా విడుదలైన తెలుగు చిత్రం "వినయ విధేయ రామ". ఈ ఏడాది సంక్రాంతి రేసులో అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన ఈ సినిమా  బాహుబలి-2 (బాహుబలి ద కంక్లూజన్)  ను బీట్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. అయితే అది ఓవరాల్‌గా అయితే కాదు. కేవలం సీడెడ్ ఏరియా వరకు మాత్రమే.
 
బాహుబలి 2 చిత్రం విడుదలైన మొదటి రోజు సీడెడ్ ఏరియాలో రూ. 6.20 కోట్ల షేర్ సాధించగా, రామ్ చరణ్ వినయ విధేయ రామ రూ. 7.15 కోట్ల షేర్‌తో ఆల్‌టైమ్ రికార్డును సాధించినట్లుగా ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. సినిమా విడుదలైన మొదటి ఆట నుంచే నెగిటివ్‌ టాక్ వచ్చినా. కలెక్షన్ల విషయంలో మాత్రం వినయ విధేయ రాముడు దుమ్మురేపుతున్నాడంటూ. మెగాభిమానులు సోషల్ మీడియాలో ఇప్పటికే కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఓవరాల్‌గా ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్ల విషయంలో టాప్ 3 ప్లేస్‌ను సొంతం చేసుకున్నట్లుగా టాక్. ఇక తర్వాతి రోజునుంచీ ఏమిటి సంగతని మాత్రం అడగవద్దు.