రస్మిక మందనలాగా...కేథరిన్‌ క్రేజ్‌ కూడా పెరుగుతుందా..?

15:19 - January 10, 2019

గత ఏడాది తెలుగు బాక్సాఫీస్ ను షేక్ చేసిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. డియర్ కామ్రేడ్ పూర్తయిన తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కేఎస్ రామారావు నిర్మాణంలో విజయ్ దేవరకొండ ఒక చిత్రం చేయబోతున్నాడు. విజయ్ దేవరకొండకున్న క్రేజ్ నేపథ్యంలో ప్రస్తుతం ఆయనతో కలిసి ఏ హీరోయిన్ అయినా నటించేందుకు ఆసక్తి చూపడం ఖాయం. అలాంటి విజయ్ దేవరకొండ కోసం దర్శకుడు క్రాంతి మాధవన్ కేథరిన్ తెర్సాను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. అందంతో పాటు మంచి నటన ప్రతిభ ఉన్న కేథరిన్ కు మంచి అవకాశం ఇప్పటి వరకు దక్కలేదు. కేథరిన్ తెలుగులో ‘సరైనోడు’ చిత్రంలో నటించి అల్లు అర్జున్ తో ఎమ్మెల్యే(మై లక్కీ ఏంజిల్) అనిపించుకున్న ఈ అమ్మడు,  రానాతో నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం తర్వాత మరే సినిమాను చేయలేదు. ఇక ఇప్పుడు దేవరకొండ సరసన ఎంపికైంది. విజయ్ దేవరకొండతో నటించిన రష్మిక మందన ఏ స్థాయికి చేరిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్ కి ఉన్న క్రేజ్ తో కేథరిన్ క్రేజ్ కూడా పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.