కొత్త డైరెక్టర్ల గురించి దేవరకొండ మాటలు వింటే...!

13:09 - January 27, 2019

కొత్త డైరెక్టర్ల గురించి సంచలన హీరో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు విజయ్ దేవరకొండ ఏం మాట్లాడాడు...? ఇంతగా వైరల్‌ అవ్వడానికి అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెలితే...విజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ' ప్రస్తుతం కొత్త డైరెక్టర్‌(భరత్ కమ్మ)తో సినిమా చేస్తున్నా. నెక్ట్స్ సినిమా క్రాంతితో చేస్తున్నా. ఆ తరువాతి సినిమా కూడా కొత్త డైరెక్టర్‌తోనే చేస్తున్నా. కొత్త డైరెక్టర్లకి ఛాన్స్ ఇవ్వడం కాదు.. అది రాంగ్ క్వశ్చన్. నేనెవరు ఛాన్స్ ఇవ్వడానికి? వాళ్లు మంచి కథ తీసుకొస్తే చెయ్యడమే. నేను ఆ సినిమా చెయ్యాలనుకుంటాను. నేనెవ్వరికీ ఛాన్స్ ఇవ్వట్లేదు. నేను భరత్ కమ్మకి ఛాన్స్ ఇవ్వట్లేదు. నేను గ్రేట్‌ఫుల్.. అలాగే లక్కీ.. భరత్ కమ్మ వంటి దర్శకుడున్నాడు. ఇంత టెక్నీషియన్ ఉండి.. కథ తీసుకొచ్చి.. నన్ను నమ్మి.. ఇంక నెక్ట్స్ సినిమా కూడా నాతో చెయ్యరా? అని నాకు ఉంటుంది' అని విజయ్ చెప్పుకొచ్చాడు. ఆ మాటలు విన్న అభిమానులు విజయ్ అద్భుతంగా మాట్లాడాడంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇప్పటి వరకూ విజయ్ చేసిన సినిమాలన్నీ దాదాపు కొత్త డైరెక్టర్లతో చేసినవే కావడం విశేషం. నాగ్ అశ్విన్, రాహుల్ సాంస్కృత్యాన్, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి, భరత్ కమ్మ తదితరులతో విజయ్ నటించాడు.