ఇండియా లెవల్లో దేవరకొండ మూవీ...

12:28 - March 13, 2019

మైత్రి మూవీ మేకర్స్ స్పీడ్ గురించి.. గట్స్ గురించి.. పరిశ్రమలో ఆసక్తిగా మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. మైత్రి సంస్థలో ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా `డియర్ కామ్రేడ్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా త్వరలోనే రిలీజ్ కి రానుంది. నేడు ఓవైపు సాయిధరమ్ తో చేస్తున్న చిత్రలహరి టీజర్ ని ఆవిష్కరించిన సదరు సంస్థ .. మరో ఆసక్తికర ప్రకటన వెలువరించింది. విజయ్ దేవరకొండ హీరోగా మైత్రి సంస్థ నిర్మించే తొమ్మిదో సినిమాని ఇండియా లెవల్లో అన్ని భాషల్లో తెరకెక్కిస్తున్నాం. ఏప్రిల్ 22న దేశ రాజధాని దిల్లీలో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తామని మైత్రి సంస్థ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దేవరకొండకు వరుసగా మైత్రి మూవీ మేకర్స్ లో రెండో సినిమా ఇది. తెలుగు తమిళం సహా ఇతర భాషల్లోనూ భారీగా రిలీజ్ చేయాలన్నది ఆలోచన. ఇది దేవరకొండ అభిమానులకు ఎగ్జయిటింగ్ మూవ్ మెంట్ అనడంలో సందేహం లేదు. గత కొంతకాలంగా ఈ సినిమా గురించి దేవరకొండ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎట్టకేలకు మైత్రి సంస్థ అధికారికంగా ప్రకటించడం ఫ్యాన్స్ లో ఉత్కంఠకు కారణమైంది. ఇదిలా వుంటే...కాక్క ముట్టై చిత్రానికి అద్భుతమైన డైలాగ్స్ అందించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆనంద్ అన్నమలై ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.  ఈ చిత్రంలో దేవరకొండ ఓ ప్రొఫెషనల్ బైకర్ పాత్రలో నటించడం ఇంకా ఎగ్జయిటింగ్ ఎలిమెంట్.