రూ.500 బ్యాలెన్స్‌ మెయింట్‌నెన్స్‌ చేయనందుకు అకౌంట్‌ క్లోజ్‌ చేశారు: దేవరకొండ

13:21 - February 5, 2019

`అర్జున్ రెడ్డి`గా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. రౌడీ కొండగా పిలుపు అందుకున్నాడు. గీత గోవిందం ట్యాక్సీవాలా సక్సెస్ తో అతడి రేంజు వేరే! అంటూ ఇండస్ట్రీ సర్టిఫికెట్ ఇచ్చేసింది.  ఇదిలా వుంటే... ఎవరి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో లెక్కలు గట్టి జాబితాలో చేర్చే ఫోర్బ్స్ ఈసారి కూడా దేవరకొండను ఫోర్బ్స్ జాబితాలో చేర్చింది. 30లోపు వయసు సంపాదకుల జాబితాలో విజయ్ దేవరకొండ పేరు ను చేర్చారు.  2018లో ఫోర్బ్స్ జాబితాలో ఏడాదికి రూ. 14 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్న సంపన్నుడిగా 72 వ స్థానాన్ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ఈసారి టాప్ 30 జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. `ఫోర్బ్స్ 30 అండర్ 30` .. 30 ఏళ్లలోపు ఉన్న యువతీ యువకులు వివిధ రంగాల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా తయారు చేసే జాబితా ఇది. అందులో దేవరకొండ పేరు చేరడంతో అభిమానుల ఆనందాలకు అవధులే లేవు. ఈ సందర్భంగా దేవరకొండ ట్విట్టర్ లో టచ్ లోకి వచ్చారు. ``25 వయసప్పుడు ఆంధ్రా బ్యాంక్ లో రూ.500 బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయలేకపోయినందుకు అకౌంట్ లాక్ చేశారు. అప్పుడు నాన్న పిలిచి 30లోపు సెటిల్ అవ్వు. అప్పుడే నువ్వు యువకుడిగా ఉండగా.. నీ తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండగా.. నువ్వు సక్సెస్ ని ఆస్వాధించగలవు... అన్నారు. నాలుగేళ్ల తర్వాత .. ఫోర్బ్స్ 100లో చేరాను. ఫోర్బ్స్ 30లో అండర్ 30 జాబితాలోనూ చేరాను`` అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం దేవరకొండ డియర్ కామ్రేడ్ చిత్రంతో మరో హిట్టు కొట్టి సత్తా చాటాలని ఎంతో తపిస్తున్నాడు. దేవరకొండతో సినిమా తీస్తున్న బ్యానర్లు అన్నీ తర్వాతి సినిమా కాల్షీట్ల కోసం కర్చీఫ్ వేసి రెడీగా ఉన్నాయి. మరోవైపు తెలుగు - తమిళ్ ద్విభాషా చిత్రాలతో కెరీర్ ని పరుగులు పెట్టించాలని తపిస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఇస్పీడ్ లోనే పారితోషికాలు - అడ్వాన్సులు అంటూ బ్యాంక్ బ్యాలెన్స్ ని స్కైలోకి పరుగులు పెట్టిస్తున్నాడు దేవరకొండ.