ఈ సారైనా నమ్మొచ్చా? మహేష్ బాబు సినిమాతో రాములమ్మ రీ ఎంట్రీ ?

01:32 - March 13, 2019

*మళ్ళీ చర్చల్లోకి రాములమ్మ రీ ఎంట్రీ 

*మహేష్ సినిమాలో ముఖ్యమైన పాత్రలొ అంటూ వార్తలు

*కన్నడ హీరో  ఉపేంద్ర కూడా ఇదే సినిమాలో 

 

 

టాలీవుడ్ అమితాబ్ గా పిలవబడ్డ ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయ శాంతి పెరుగుతున్న వయసుతో క్రమంగా వెండి తెరకి దూరం అయ్యింది. తర్వాత నెమ్మదిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. అయితే అక్కడకూడా మంచి కెరీర్ ఉన్నసమయంలో తప్పటడుగులు వేసి మరీ అంత సక్సెస్ఫుల్ గా రాణించలేక ఇప్పుడు పాలిటిక్స్ లోనూ ఫెయిల్యుర్ అన్న ముద్ర వేయించుకుని చాలాకాలంగా మెయిన్ స్ట్రీమ్  రాజకీయాలకు దూరంగానే ఉండి పోయింది. 
 అయితే గత రెండేళ్ళుగా ఈ రాములమ్మ మళ్ళీ తెరమీదకి రీ ఎంట్రీ ఇస్తోందంటి వార్తలు వచ్చాయి.

ఒసేయ్ రాములమ్మ పార్ట్ 2 అనీ, చిరంజీవితో కలిసి నటిస్తోందనీ రకరకాల రూమర్లు వచ్చాయి కానీ ఒక్కొక్క ప్రాజెక్ట్ బయటికి వస్తున్న కొద్దీ అవన్నీ గాలి వార్తలే అని అర్థమై పోయింది జనానికి. అయితే ఇప్పుడు మళ్ళీ అలాంటిదే మరో వార్త ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే "మహర్షి"గా రానున్న మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ తర్వాత అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తుండ‌గా, ఇందులో ఒకప్పటి టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ యాక్ట్రెస్ విజ‌య‌శాంతి, శాండ‌ల్‌వుడ్ స్టార్ ఉపేంద్ర ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే ఇదీ ఎప్పటి మాదిరే గాలివార్తేనా లేక నిజమా అన్నది అర్థం కావాలంటే మాత్రం కొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇక ఈ ప్రాజెక్టులో కథానాయిక‌గా ర‌ష్మిక మంధాన‌ని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. నిజానికి టాలీవుడ్ లో ఎంతమంది స్టార్లు వచ్చినా ఒకనటి ఫైటింగుల హీరోయిన్ అయిన విజయశాంతిని బాగానే గుర్తు పెట్టుకున్నారు తెలుగు ప్రేక్షకులు. "ఒసేయ్ రాములమ్మ" లాంటి సినిమాకి ఇప్పటికీ అభిమానులున్నారు. సో...! ఆమె రీ ఎంట్రీ ఒక పవర్ఫుల్ పాత్రతో గనక అయితే ఖచ్చితంగా బాగానే ఉంటుందన్నది సినీ విశ్లేషకుల అభిప్రాయం. మరి ఈసారైనా ఈ సీనియర్ ఫైర్ బ్రాండ్ తెరమీదకు కాలు మోపుతుందా లేదా అన్నది చూడాలి.