ఈసారి నో పాలిటిక్స్‌ అంటున్న విజయ్ ...

15:00 - March 15, 2019

తమిళనాట సినిమాల్లో రాజకీయాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ సినిమాలు - రాజకీయాలు మమేకం అయ్యి ఉంటాయి. అది ఈమద్య మొదలైనది కాదు - ఎప్పటి నుండో సినిమా వారు రాజకీయాల్లోకి వెళ్లడం - రాజకీయాల్లో ఉండి సినిమాలను చేయడం అక్కడి వారికి కామన్ అయ్యింది. ఇక రాజకీయ ప్రాధాన్యత ఎక్కువగా ఉండే సినిమాలు చేసే విజయ్ కూడా రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. విజయ్ ఈమద్య కాలంలో నటించిన సినిమాలన్నింటికి చూస్తే  ప్రస్తుత రాజకీయాలపై సెటైర్స్ వేస్తూ లేదా విమర్శలు చేస్తూ వచ్చాడు. ఇక ప్రస్తుతం ఈయన అట్లీ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో కూడా క్రీడా రంగంలో రాజకీయ ప్రభావం ఎలా ఉందనే విషయంపై ఉంటుందని అంతా భావించారు. కాని తాజాగా విజయ్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెళ్లడించాడు. తన ప్రతి సినిమాలో కూడా పొలిటిక్స్ ను చూపించి నాకే బోర్ కొట్టింది. అందుకే ప్రస్తుతం తాను చేస్తున్న అట్లీ మూవీలో అలాంటివి ఏమీ లేకుండా పూర్తి ఎంటర్ టైన్ మెంట్ తో కలర్ ఫుల్ గా సినిమా సాగబోతుందని విజయ్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో సినిమా గురించి తమిళ జనాల్లో మరియు ఫ్యాన్స్ లో అంచనాలు మరింతగా పెరిగాయి. వివాదం లేకుండా రాబోతున్న సినిమా అవ్వడం వల్ల తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అంటూ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.