పింక్ తమిళ రీమేక్: విద్యాబాలన్ ని తెస్తున్నారట

12:36 - January 29, 2019

పింక్... దాదాపుగా ఇండియన్ సినిమాని ఒక చిన్నపాటి కుదుపుకు గురి చేసిన సినిమా. బాలీవుడ్ మొత్తం ఒక్క సారి తాప్సీ వైపు చూపులు తిప్పి మరీ ఎవరీ అమ్మాయి? అంటూ వెతికిన సినిమా. మోరల్స్ అనే పేరుతో, మానసికంగా బాదితురాలినే దోషిగా చూస్తున్న మన సమాజాన్ని ప్రశ్నించించిందీ సినిమా. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఈ సినిమాకి ఒక అదనపు ఆక్ర్షణ. ఈ సినిమాతో ఒక్క సారి బాలీవుడ్ లో ఒక గుర్తింపు తెచ్చుకుంది తాప్సీ పన్ను. ఈ సినిమాని ఇప్పుడు తమిళ్ లోకి రీమేక్ చేయనున్నారు అన్న విషయం తెలిసిందే...  


ఇటీవ‌ల విశ్వాసం అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అజిత్ త్వ‌ర‌లో పింక్ రీమేక్ చేయ‌నున్నాడు. ఖాకీ ఫేమ్ హెచ్ వినోథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా..బోనీకపూర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అజిత్‌కి 59వ చిత్రం కాగా, ఇందులో త‌మిళ నేటివిటీకి అనుగ‌ణంగా ప‌లు మార్పులు చేస్తున్న‌ట్టుగా తెలుస్తుంది. ఈ మార్పుల ప్రకారం హీరో మూలకథలో ఉన్నట్టు మరీ వృద్దుడు కాదట. కాబట్టి ఈ నడివయసు లాయర్ కి ఒక హీరోయిన్ కావాల్సి వచ్చింది. ఈ తమిళ రీమేక్ లో  హీరోయిన్ పాత్ర కోసం విద్యాబాల‌న్‌ని ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. హిందీలో అమితాబ్‌బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రల్లో పింక్ తెర‌కెక్కింది.

 నిజానికి తాప్సీ పాత్ర‌లో ముందు న‌జ్రియాని అనుకున్న‌ప్ప‌టికి ఇప్పుడు ఆ పాత్ర కోసం శ్ర‌ద్ధ శ్రీనాథ్‌ని తీసుకున్నారు. జర్నలిస్టు రంగరాజ్‌ పాండే కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. యువన్‌ శంకర్‌రాజా సంగీతం సమకూర్చుతున్నారు. నీరవ్‌షా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. అతి త్వ‌ర‌లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. బాలీవుడ్ లో అమితాబ్ పాత్ర అల్జిమర్స్తో బాదపడే ఒక వృద్దలాయర్. కానీ తమిళ రీమేక్ లో మాత్రం అజిత్ మరీ అంత ముసలివాడుగా కాకుండా దైనమిక్ లాయర్ గా కనిపించనున్నాడట.