సర్పైజ్ ఇస్తా..

23:41 - August 17, 2018

       విక్టరీ వెంకటేష్‌ హీరోగా కెరీర్ ను మొదలు పెట్టి ఈ రోజుతోటి 32 ఏళ్లు  పూర్తి అయ్యాయి. సినిమా కుటుంబం నుండి వచ్చినాకూడా తనసొంత ఇమేజ్ డెవలప్ చేసుకున్నాడు. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా చక్రం తిప్పాడు. టాలీవుడ్ లో వెలుగు వెలిగిన  నలుగురు అగ్రహీరోలలో ఒకడిగా వెండి తెరపై మెరిసాడు. ఆగస్టు 14న 1986లో కలియుగ పాండవులు మూవీ రిలీజ్ తో వెంకటేష్ హీరోగా  వెండితెరకు పరిచయం అయ్యాడు.
   వెంకటేష్ తన 32 సంవత్సరాల సినీ కెరీర్ కు సహకరించిన వారందరికి ఫేస్ బుక్ ద్వార కృతజ్ఞతలు తెలుపాడు. అభిమానుల సహకారం తోనే ఇంతటి స్థాయిలో ఉన్ననని  తనకు బాసటగా నిలిచినందకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంకటేష్ త్వరలో ఓ సర్ఫ్రేజ్ ఇస్తున్నట్టు తెలిపాడు. ఏంటో ఆ సస్సెన్స్ అంటూ వెంకీ ఫ్యాన్స్, టాలీవుడ్ జనాలు ఎదురుచూస్తున్నారు.