ఇక్కడ ఫ్లాపు: కానీ అక్కడ మాత్రం సూపర్‌హిట్‌

16:58 - April 1, 2019

ఒక్కోకసారి మనం అనుకుంది ఒకటి అయితే...అయ్యేది ఒకటవుతుంది. నయనతారా నటించిన వాసుకి సినిమాకు కూడా ఇలాగే జరిగింది. వివరాల్లోకి వెలితే... లైంగిక వేధింపుల నేపథ్యంలో ఓ గృహిణి చేసే అసాధారణ పోరాటాన్ని నేపధ్యంగా తీసుకుని నిర్మించిన  ఈ డబ్బింగ్ మూవీ ఇక్కడ కనీస స్థాయిలో ఆడలేదు.  కానీ ఇదే సినిమా మళయాలంలో  పుతియ నిర్ణయం పేరుతో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. నయన్ కు బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిలిం ఫేర్ అవార్డు కూడా ఇచ్చింది . ఇదిలావుంటే...ఈసినిమాని ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా రీమెక్‌ చేయబోతున్నారు.  ఏ వెడ్నెస్ డే-బేబీ-స్పెషల్ చబ్బీస్-ఏంఎస్ ధోని లాంటి కల్ట్ మూవీస్ ని రూపొందించిన నీరజ్ పాండే దీన్ని టేకప్ చేయబోతున్నారు. గత ఏడాది అయారి రూపంలో నీరజ్ కు పెద్ద షాక్ తగిలింది. ఎన్నో అంచనాలు పెట్టుకుంటే డిజాస్టర్ అయ్యింది. అందుకేనేమో ఈసారి వాసుకిని ఎంచుకున్నారు. నయనతార పాత్రను ఎవరు పోషిస్తారో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.