మేమిద్దరం స్నేహితులం అంటున్నా...మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు?: వరలక్ష్మీ

13:49 - December 31, 2018

గత కొంత కాలంగా తమిళ మరియు తెలుగు మీడియాలో విశాల్ మరియు వరలక్ష్మిల ప్రేమ విషయమై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. తామిద్దరం మంచి స్నేహితులం అంటూ ఇద్దరు కూడా పదే పదే చెబుతున్నా కూడా మీడియాలో మాత్రం వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా వరలక్ష్మి ప్రేమ గురించి ఒక తమిళ మీడియా సంస్థ సుధీర్ఘ కథనంను రాసిందట. దాంతో వరలక్ష్మికి తీవ్రమైన కోపం వచ్చింది. తాను పదే పదే చెబుతున్న కూడా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటూ ప్రశ్నించింది. మీడియాలో విశాల్ మరియు తన పై వచ్చిన కథనం పై వరలక్ష్మి స్పందిస్తూ... తమ గురించి వార్త రాసిన వారిని లూజర్స్ అంటూ సంభోదించింది. నా పెళ్లి గురించి పదే పదే కథనాలు రాస్తున్న వారి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పెళ్లి పై ఆసక్తి లేదని నా పెళ్లి గురించిన ఆలోచనే లేదు మరి మీకెందుకు ఇంత ఆతృతా అంటూ ఆగ్రహంగా పోస్ట్ చేసింది. నటిగా నిరూపించుకునేందుకు వరలక్ష్మి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె  పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్ గా కాకుండా సర్కార్ చిత్రంలో విలన్ గా నటించి మంచి మార్కులు పొందింది. ఈమె తెలుగులో కూడా నటించేందుకు కమిట్ అయినట్లుగా తెలుస్తోంది.  ఈ సమయంలోనే పెళ్లి ప్రేమ పై ఎప్పటికప్పుడు స్పందిస్తూ కొట్టి పారేస్తూ వస్తోంది.