ఒంటేరు ప్రతాపం తగ్గిందా...!

17:56 - January 18, 2019

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండబోరు అనే నానుడి మరోసారి నిజం కానుంది. ముందస్తు ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌పై గజ్వేల నుంచి పోటీచేసి ప్రతాప్‌ రెడ్డి...టీఆర్‌ఎస్‌ అంటే ఒంటికాలుపూ లేచిన సంగతి అందరికీ తెలిసిందే. అదంతా...ఎన్నికలనాటి ఫైట్‌. ఇప్పుడు తన రాజకీయ భవితవ్యం కోసం గులాబీ ఫిట్‌కు రెడీ అయ్యారట. ఈ విషయాన్ని శుక్రవారం ఒంటేరు ప్రతాపరెడ్డి స్వయంగా ధ్రువీకరించారు. అయితే టీఆర్‌ఎస్‌లోకి ప్రతాపరెడ్డిని చేర్చుకోవడం ద్వారా సీఎం కేసీఆర్‌కే సొంత నియోజకవర్గంమేగాక, పార్టీకి కూడా ప్లస్‌ అయ్యేలా కలరింగ్‌ ఇచ్చేందుకు అంతా సెట్‌ చేశారట.


ఆరు నెలల్లో ప్రతాప్‌రెడ్డే ఎమ్మెల్యేనా...?
           ప్రతాపరెడ్డిని ఎన్నికల వేళ అణిచివేసేందుకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సామదానబేదదండోపాయాల్లో బేద, దండనలు ప్రయోగించిన సందర్భాలే కోకొల్లం. అప్పుడది కరెక్టు. కానీ... ఇప్పుడు లెక్క మారింది. గులాబీ కార్పెట్‌ పరిచి ప్రతాప్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించనుంది. ప్రతాప్‌ రెడ్డి చేరికపై వస్తున్న ఊహాగానాలకు శుక్రవారం పుల్‌స్టాప్‌ పడనుంది. టీఆర్‌ఎస్‌లోకి చేరిక కన్‌ఫాం అని ప్రతాప్‌ రెడ్డి స్టేట్‌మెంట్‌ ఇచ్చేశారు. సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్లు స్వయంగా మీడియాకు వెల్లడించారు. అందుకు కానుకగా ప్రతాపరెడ్డికి ఎమ్మెల్సీ పదవి కట్టబెడుతారా...? లేక ఇంకా ఏ పోస్టు ఇచ్చేది క్లారిటీ రావాల్సి వుంది. సమీప రోజుల్లో తన స్థానం నుంచే ప్రతాపరెడ్డిని టీఆర్‌ఎస్‌ తరపున పోటీకి దించే అవకాశం ఉందని కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌లో చక్రం తిప్పాలంటే..మాత్రం ఎంపీగా పోటీ చేయక తప్పని పరిస్థితి. అలాంటి సమయంలో గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌ కి గట్టి పోటీ ఇచ్చిన ప్రతాప్‌ రెడ్డి దీటుగా ఎదుర్కొనే...అభ్యర్థి ఎవ్వరూ టీఆర్‌ఎస్‌కు కనుచూపుమేరలో కనిపించలేదంట. సీఎం కేసీఆర్‌ రాజకీయ సమీకరణాల రిత్యా... ఎమ్మెల్యేకు రాజీనామా చేశాక...అక్కడి నుంచి ప్రతిపక్ష పార్టీ తరపున ప్రతాప్‌ రెడ్డి బరిలో దిగితే...ఆయన గెలుపు ఖాయమే. అంతటి సానుభూతి ఉంది గజ్వేల్‌లో ప్రతాప్‌రెడ్డికి అలా జరిగితే..ఇంకేమైనా ఉందా? కండువాలన్నీ సర్దిచేసివాళ్లంతా... మళ్లీ మైక్‌ల ముందుకు వచ్చి ..అధికార పార్టీని ఎండగడుతరు. దీంతో ప్రతిపక్ష పార్టీకి చేజేతుల ప్రాణం పోసినట్లయితది. అందుకే గజ్వేల్‌లో ఇప్పట్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన గెలిచేది ప్రతాప్‌రెడ్డినే. కానీ ఎగిరేది మాత్రం గులాబీ జెండా ఇట్లా సెట్‌ చేసుకునేందుకే ప్రతాప్‌రెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చర్చజరగుతోంది. పైకి ఫెడరల్‌ నాటకం రక్తి కట్టించి...అందులో భాగంగా పార్లమెంటుకు పోటీ చేస్తున్నట్లు ప్రజలకు బిల్డప్‌ ఇచ్చి... ఆ తదనంతరం సీఎం పీఠం నుంచి కేసీఆర్‌ తప్పుకోని ...తన తనయుడు కేటీఆర్‌ను కూర్చోబెట్టడం ఖాయం అనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో గజ్వేల్‌ అసెంబ్లీకి త్వరలోనే ఉప ఎన్నికలు రావచ్చు. అప్పుడు టీఆర్‌ఎస్‌ నేతలు చెమటోడ్చే అవసరం లేకుండా...గెలిచిరావాలంటే ప్రతాపరెడ్డి అయితేనే పర్‌ఫెక్టు అని సీఎం కేసీఆర్‌ భావించే గులాబీ తీర్థం ఇస్తున్నారట.


చెమటోడ్చే నేత....అప్పటికి అలిగితే...
        గజ్వేల్‌ సీఎం కేసీఆర్‌ను గెలిపించింది. ప్రజలు. కానీ గెలిపించేలా జనాన్ని టీఆర్‌ఎస్‌ వైపు మలిపింది మాత్రం టీఆర్‌ఎస్‌ ట్రబుల్‌ షఉటర్‌ హారీష్‌రావు. కానీ గజ్వేల్‌లో ఉప ఎన్నిక వచ్చేనాటికి సీఎంగా ఉంటారు. ఆ టైమ్‌లో ఉప ఎన్నికలో కేటీఆర్‌ కోసం అంతా దిగి పనిచేసేందుకు హరీష్‌రావు ఆసక్తి చూపకపోవచ్చు. అంటే హరీష్‌రావు సహకారం లేకుండానే ఎన్నికల్లో గెలిసేలా స్కెచ్‌ రెడీ అవుతుందన్నమాట. అందుకు గజ్వేల్‌ ఉప ఎన్నికలతోనే నాంది పలికి హరీష్‌కే టీఆర్‌ఎస్‌ అవసరం కానీ...టీఆర్‌ఎస్‌కు హరీష్‌ అవసరం కానీ లేదని చెప్పడం ద్వారా కేటీఆర్‌ సీఎం సీటు పదిలం చేసుకోబోతున్నారని టాక్‌.