రజినీ ఫోటోతో ఆస్ట్రేలియా పోలీస్ ప్రచారం : ఖండాలు దాటిన రజినీ క్రేజ్

00:26 - February 18, 2019

 

*ఖండాలు దాటిన తలైవా క్రేజ్ 

*ఆస్త్రేలియన్ పోలిస్ ట్వితర ఖాతాలో రజిని ఫోటో 

*పట్టలేని ఆనందంలో రజినీకాంట్ ఫ్యాన్స్ 

 

తలైవా రజినీ కాంత్ అంటే ఒక్క దక్షిణ భారతం లోనే కాదు మొత్తం భారత దేశంలోని సినీ అభిమానులందరికీ తెలిసిందే. అయితే ఒక్క భారత దేశం మాత్రమే కాదు రజినీకి జపాన్ లోనూ అభిమాన సంఘాలున్నాయన్న విషయమూ మనకు తెలుసు కానీ ఆస్ట్రేలియాలో కూదా రజినీ హవా ఉందనితెలిస్తే మాత్రం కాస్త ఆశ్చర్యం అనిపించక మానదు. ఇటీవల ఆసిస్ పోలీస్ ట్విట్తర్ ఎకౌంట్ నుంచి రజినీ ఫొటో అప్లోడ్ అయినప్పుడు ఆశ్చర్యం అనిపించక మానదు. 


 ఇంతకీ విషయం ఏమితంటే మన దేశంలో లాగానే  అస్ట్రేలియాలోని డార్బీ సిటీ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌ను నిర్వహించారు. ఈ టెస్ట్‌లో ఓ వ్యక్తి అల్కహాల్ శాతం 0.341 శాతం వచ్చింది. ఆస్థాయిలో నంబర్ కనిపించేసరికి షాక్ తిన్నారట పోలీసులు నిజానికి ఆ మత్తులో కారు నడపటం కాదు కనీసం నడవటం కూడా అసాధ్యమైన పని 


 సాధారణంగా కోమాలో లేదా శస్త్రచికిత్స చేసే సమయంలో ఇచ్చే మత్తు మందు సమయంలో ఓ వ్యక్తికి అలాంటి పర్సంటేజ్ రికార్డు అవుతుందట. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వ్యక్తి అల్కహాల్ శాతం పరిశీలించిన పోలీసులు కోమాలో ఉన్న వ్యక్తి కారు నడుపుతున్నాడా ఏంటి అని ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ పర్సంటేజ్‌ను ఫొటో తీసిన అధికారులు ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

పోస్ట్‌కు రజనీకాంత్ నటించిన 2.0 చిత్రంలోని ఓ ఫొటోను కూడా జతపరచడంతో ఈ పోస్ట్ ట్విటర్‌లో వైరల్ అయ్యింది. ఇక మనదేశపు అభిమానులకు కూడా  అది రీచ్ అవటంతో ఇక రీట్వీట్ల వెల్లువ మొదలయ్యింది.  ఈ పోస్ట్‌పై స్పందించిన నెటిజన్లు తలైవా స్టామినా ఆస్ట్రేలియా పోలీసులకు కూడా తెలుసు..అందుకే ఆయన ఫొటో పెట్టి ఈ వార్తను వైరల్ చేశారని ట్వీట్‌లు పెట్టారు.