అమెరికా అధ్యక్ష రేసులో హిందూ మహిళ: ట్రంప్ పై పోఅటీ చేయనున్న తులసీ గబ్బార్డ్

12:47 - January 13, 2019

అమెరికా.. ప్రపంచ పెద్దన్న, అగ్రరాజ్యం, ప్రపంచ పోలీస్, సామ్రాజ్యవాద దేశం ఇలా ఇప్పటివరకూ అమెరికా అంటే ఒకరకమైన మోజూ ఇంకో రకమైన భయమూ ఉన్నాయిమనలో. నిజానికి అక్కడ వర్ణవివక్ష, ఇతర దేశాల ప్రజలంటే ఒకరకమైన చిన్న చూపూ ఉండేవి. కనీసం ఉధ్యోగాల్లోనే వాటా ఇవ్వటానికి మనలని తక్కువ జాతి ప్రజలు గా చూసే అమెరికన్లు ఒక హిందూ సంతతికి చెందిన స్త్రీని తమ అధ్యక్షురాలుగా ఎన్నుకోవటానికి ఒప్పుకుంటారా?  
        అవును రాబోయే 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో తొలిసారి ఓ హిందూ పోటీచేయబోతున్నారట. హవాయి నుంచి అమెరికా ప్రతినిధుల సభకు డెమొక్రటిక్ పార్టీ తరుఫున వరుసగా నాలుగోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న 37 ఏళ్ళ తులసీ గబ్బార్డ్ ఈ ఎన్నికల్లో అమెరికా అధ్యక్సురాలవటానికి ప్రయత్నిస్తున్నారు. 2020లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తలపడనున్నట్లు శనివారం ఆమె ప్రకటించారు. 21 ఏండ్ల అతి చిన్న వయస్సులోనే ప్రతినిధుల సభకు ఎంపికై రికార్డు సృష్టించారు. ప్రస్తుతం అధ్యక్ష పదవికి పోటీపడనున్న తొలి హిందూ మహిళగా నిలువనున్నారు. ఇండో అమెరికన్లలో తులసీ ప్రఖ్యాత నేతగా పేరుగాంచారు.
ఇప్పటివరకూ అమెరికా చరిత్రలో అసలు మహిళా అధ్యక్షురాలు లేనే లేరు ఇప్పుడు తులసి తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర లిఖించేందుకు సన్నద్ధమవుతున్నారు. మరో వారం రోజుల్లో పూర్తి వివరాల్ని వెల్లడిస్తానని ఆమె పేర్కొన్నారు. డెమొక్రటిక్ పార్టీ తరుఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు సెనెటర్ ఎలిజబెత్ వారెన్ ఇప్పటికే ప్రకటించారు. మరో 12 మంది అభ్యర్థులు సైతం పోరుకు సిద్ధంగా ఉన్నారు. వీరిలో భారత సంతతికి చెందిన కాలిఫోర్నియా సెనెటర్ కమలా హ్యారిస్ ఒకరు. ఇరాక్ యుద్ధం సమయంలో హవాయి ఆర్మీ నేషనల్ గార్డు నెలకొల్పిన మెడికల్ క్యాంప్‌లో ఏడాదిపాటు తులసీ గబ్బార్డ్ సేవలందించారు.