హీరో మోహన్ బాబు ని చుట్టుముట్టిన పోలీసులు: అయినా నిరసన ఆపేది లేదంటూ....

11:54 - March 22, 2019

*మోహన్‌బాబు ఆయన కుమారులు విష్ణు, మనోజ్ నిరసన

*విధ్యార్థులతో కలిసి తిరుపతిలో నిరసన ర్యాలీ

*శ్రీవిద్యానికేతన్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని

 

 

ప్రముఖ సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మంచు మోహన్ బాబు తమ విద్యాసంస్థకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో కలిసి చేస్తున్న నిరసన ర్యాలీని పోఅలీసులు అడ్డుకున్నారు. గత రెండు విద్యాసంవత్సరాలుగా  శ్రీవిధ్యానికేతన్ విధ్యాసంస్థలకు ప్రభుత్వం నుంచిరావాల్సిన ఫీజ్ రీఎంబర్స్మెంట్ బకాయిలు రాకపోవటంతో మోహన్‌బాబు ఆయన కుమారులు విష్ణు, మనోజ్ నిరసన బాట పట్టారు. తమ విధ్యాసంస్థలోని విధ్యార్థులతో కలిసి తిరుపతిలో నిరసన ర్యాలీ చేపట్టారు.  మోహన్ బాబు భారీ నిరసనకు దిగనున్నారని ముందే  సమాచారం రావడంతో తిరుపతి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ తరహా ర్యాలీలవల్ల తిరుపతిలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని మోహన్‌బాబుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే మోహన్ బాబు నిరసనని ఆపటానికి ఒప్పుకోకపోవటంతో. ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు హౌస్ అరెస్ట్ చేసేందుకు యత్నించారు.


  ‘మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉంచారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి  శ్రీవిద్యా నికేతన్‌కు సుమారు రూ.17కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రావాలి. ఎన్నోసార్లు లేఖ రాసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోంది. చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా చేపట్టా’ అంటూ స్పష్టం చేసిన మోహన్ బాబు పోలీసుల వైఖరి పై ఏమాత్రం అసహనం ప్రదర్షించకుండా వ్యూహాత్మకంగా తన విద్యాసంస్థ ఎదుటే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.  ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచే తిరుపతి రూరల్‌ రంగంపేటలోని విద్యానికేతన్‌ విద్యాసంస్థల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు మోహన్‌ బాబు ధర్నాతో తిరుపతి-పీలేరు రహదారిలో సుమారు 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

 ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా పట్టించుకోలేదని చెప్పిన మోహంబాబు సీఎం చంద్రబాబు అంటే ఆయనకి ఇష్టం. అయినా మాకు ఫీజు బకాయిలు చెల్లించలేదు. చంద‍్రబాబు అనేకసార్లు మా కాలేజీకి వచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ 2014 నుంచి 2018 వరకూ రూ.19 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని  రెండు విద్యాసంవత్సరాలు గడుస్తున్నా ఇంత వరకు బకాయిలను చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే. అసలే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వానికి ఈ తరహా మచ్చ సరికాదనే మాట తిరుపతి రాజకీయ వర్గాల్లోనూ వ్యక్తం కావటం గమనార్హం.