తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దారుణ హత్య: అనుమానాలు బీజేపి పైనే ?

00:11 - February 10, 2019

పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది బెంగాల్ లో ఎమ్మెల్యే హత్య దేశవ్యాప్తంగా సంచలనం అయింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సత్యజిత్‌ బిశ్వాస్‌ను గుర్తుతెలియని దుండుగులు కాల్చిచంపారు. బెంగాల్‌లోని కృష్ణగంజ్‌ నియోజకవర్గం నుంచి బిశ్వాస్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నాడియా జిల్లాలో శనివారం రాత్రి జరిగిన సరస్వతి పూజకు వెళ్లి తిరిగి వస్తుండగా ఆయనపై దుండుగులు కాల్పులకు పాల్పడ్డారు.

శనివారం రాత్రి పుల్‌బరీలో ఏర్పాటుచేసిన సరస్వతీపూజ కార్యక్రమంలో బిశ్వాస్‌ పాల్గొన్నారు. జనసమూహం ఎక్కువగా ఉండటతో ఇదే అదునుగా భావించిన దుండగులు అతి సమీపంలో నుంచి ఎమ్మెల్యేపై కాల్పులు జరిపారు. స్థానికులు తేరుకునే లోపే దుండగులు అక్కడి నుంచి మాయమయ్యారు. ఈ ఘటనతో కృష్ణగంజ్‌ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. 

అయితే సత్యజిత్ హత్య బీజేపీ పనే ఆరోపణ వినిపిస్తోంది. బీజేపీ మద్దతుదారులే ఆయనను హత్య చేశారని టీఎంసీ నాడియా జిల్లా అధ్యక్షుడు గౌరీశంకర్‌ ఆరోపిస్తున్నారు. బీజేపీ నేత ముకుల్‌ రాయ్‌కు ఈ హత్యతో సంబంధం ఉందని, ఇది ముమ్మాటికి రాజకీయ హ్యత్యే అని ఆయన అన్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.