డిజాస్టర్‌ స్థానం దక్కింది...కానీ లాభం 125 కోట్లు

16:39 - January 8, 2019

భారీ క్రేజ్ తో రూపొందే మల్టీ స్టారర్స్ కు ఉండే సౌలభ్యం దేనికి ఉండవు. ముఖ్యంగా డిజిటల్ విప్లవం మొదలయ్యాక నిర్మాతల ఆదాయ వనరులు అమాంతం పెరిగిపోయాయి.  తాజాగా తగ్స్ అఫ్ హిందూస్తాన్ దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. ఈ ఏడాది వచ్చిన అత్యంత దారుణమైన డిజాస్టర్స్ లో ఫస్ట్ ర్యాంక్ కోసం పోటీ పడిన ఈ అమితాబ్ అమీర్ ఖాన్ల మల్టీ స్టార్ బాక్స్ ఆఫీస్ దగ్గర తుస్సుమన్న సంగతి తెలిసిందే. విషియానికొస్తే...తగ్స్ అఫ్ హిందూస్తాన్కైన బడ్జెట్ సుమారు 240 కోట్లు. కాంబో మీద క్రేజ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఫైనల్ రన్ లో 100 కోట్ల దాకా తెచ్చింది. ఇది షేర్ రూపంలో వచ్చింది. ఇక రిలీజ్ కు ముందున్న హైప్ వల్ల శాటిలైట్ డిజిటల్ హక్కుల ద్వారా మరో 140 కోట్లు వచ్చాయి. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ ఇక్కడ పెద్ద ప్లస్ అయ్యింది. అంటే మొత్తం పెట్టుబడి ఈ రెండు మార్గాల్లోనే వచ్చింది. కథ ఇక్కడితో అయిపోలేదు. మ్యూజిక్ ఆడియో వీడియో రైట్స్ కు మరో 15 కోట్లు ముందే వచ్చి పడ్డాయి. ఇటీవలే చైనాలో విడుదల చేసారు. అమీర్ ఉన్నాడు కాబట్టి మంచి ధరకు సేల్ అయ్యింది. దాన్నుంచి మరో 110 కోట్లు తోడయ్యాయి. అంటే మొత్తంగా పెట్టుబడిని మైనస్ చేసుకుని చూసుకున్నా 125 కోట్ల రూపాయలు లాభం వచ్చిందన్న మాట. చెత్త సినిమా అనే టాక్‌ వచ్చింది కానీ...నిర్మాత మాత్రం భారీ ఎత్తున సేఫ్ అయ్యాడు. మరి నష్టపోయింది ఎవరు అనే డౌట్ రావొచ్చు. డిస్ట్రిబ్యూటర్లే అందులో అనుమానం అక్కర్లేదు.  సినిమా తీసాక లాభం వచ్చిందా లేదా అనేదే ముఖ్యం. సో తగ్స్ అఫ్ హిందూస్తాన్ నిర్మాత యాంగిల్ లో పాస్ అయినట్టే.