"లా పస్క్యులిటా" వెనుక రహస్యమేమిటి? : కూతురు శవాన్నే బొమ్మగా మార్చాడా?

08:50 - March 24, 2019

*ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిన  "లా పస్క్యులిటా"  

*శతాబ్దం దగ్గర పడుతున్నా తేలని రహస్యం 

*నిజంగా బొమ్మేనా? లేదా బొమ్మ రూపంలో ఉన్నా శవమా? 
 

పిరమిడ్ లలో ఆనాటి రాజుల, రాజవంశీకుల శరీరాలని దాచి ఉంచేవాళ్ళు వాళ్ళు ఏదో ఒకనాటికి మళ్ళీ బతికి వస్తారని దానికోసమే ఆశరీరాలు మళ్ళీ నిలిచి ఉండాలనీ కొన్ని రకాల రసాయనాలతో ఆ మృత శరీరాలని "మమ్మీ"లుగా మార్చి వేలసంవత్సరాలు నిల్వ ఉంచేవాళ్ళు. తర్వాత ఆ మమ్మీ లలో చాలావరకూ పాడైపోగా మరికొన్ని మ్యూజియం లలో ప్రదర్సణకు ఉంచటానికి ప్రపంచం నలుమూలలకూ తరలించ బడ్డాYఇ. హైద్రబాద్ మ్యూజియం లోనూ అలాంటి నిజమైన మమ్మీ ని మనం చూడవచ్చు. అయినా అందరికీ తెలిసిన విశయాలే కదా ఇవన్నీ అంటారా? అయితే ఇప్పుడు మీరు చదవబోయే విశయం మరింత ఆసక్తిగానూ, భాయం కలిగించేదిగానూ ఉందబోతోంది దానికి చిన్న ఇంట్రడక్షన్ కోసమే ఈ మమ్మీ ల ప్రస్తావన... 
   బట్టల షోరూమ్ షోకేసుల్లో ఉండేబొమ్మలని చూస్తూనే ఉంటాం. కేవలం బట్టలని అందంగా ప్రజెంట్ చేయటానికే అవి వాడతారని మనకు తెలిసిందే. అయితే మీరెప్పుడైనా "లా పస్క్యులిటా" గురించి విన్నారా??

మెక్సికోలోని చిహ్వావా ప్రాంతంలో పస్కులా ఎస్పార్జా అనే వ్యాపారి తన దుకాణంలో ఒక బొమ్మను ఉంచాడు. 1930లో ఏర్పాటు చేసిన లా పస్క్యులిటా అనే ఈ బొమ్మను చూసి చాలామంది భయాన్ని వ్యక్తం చేసేవారు. చూపులు తిప్పుకోనివ్వని ఆ బొమ్మని చూసి ఇది బొమ్మ కాదేమో అన్న అనుమానం వ్యక్తం చేసేవారు కస్టమర్లు. అచ్చు గుద్దినట్టు మనిషిలా కనిపించే ఈ బొమ్మని చాలామంది ఒక మెన్నిక్విన్ (కదలకుండా గంటలతరబడి బొమ్మలా నిలుచునె కళ) కళాకారిని అనుకున్నారు కూడా. అయితే ఆ బొమ్మని దగ్గర చూసిన కొందరు మాత్రం విపరీతమైన భయంతో వణికి పోయారు. బొమ్మ కళ్లు తమనే చూస్తున్నట్లు వుండేవని ఒకసారి చూస్తే.. రాత్రంతా ఆ కళ్లు తమని వెంటాడుతున్నట్టే ఉంటుందట. ఆ కళ్ళని కొద్దిసేపు చూస్తే వణుకు పుట్టటం ఖాయం అంటూ ఉంటారు. 


 ఆ దుకాణంలో పనిచేసిన సోనియా బురుసిగ చెప్పిన మాటలు వింటే ఒళ్లు గగూర్పాటు కలుగుతుంది. ‘‘ఆ బొమ్మకు నేను దుస్తులు మార్చేదాన్ని. ఆ బొమ్మ వద్దకు ఎప్పుడు వెళ్లినా నా చేతులు చెమటతో తడిపోయేవి. ఆమె చేతులు నిజమైన చేతుల్లా ఉండేవి. ఆమె కాళ్లపై నరాలు ఉబ్బి ఉండేవి. ఆమె బొమ్మ కాదు, నిజమైన మనిషే అని నేను నమ్మేదాన్ని’’ అని తెలిపింది. 

నిజానికి ఆ షాపు యజమాని కుమార్తె పస్క్యులిటా కొన్నేళ్ల క్రితం ఆ దుకాణంలోనే వెడ్డింగ్ గౌన్లు విక్రయించేది.ఓ రోజు బ్లాక్ విడో అనే సాలీడు కుట్టడంతో చనిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ బొమ్మ ఆ దుకాణంలో ప్రత్యక్షమైంది. ఆ బొమ్మను లా పస్క్యూలిటా అని ముద్దుగా పిలిచేవారు.ఆ బొమ్మను ఆమె జ్ఞాపకార్థమే లా పస్క్యులిటా అని ముద్దుగా పిలిచేవారు కూడా.పెళ్లికూతురి వస్త్రాల్లో కనబడే ఆ బొమ్మను చూసిన వారంతా నిజమైన మనిషే అని భావించేవాళ్లు.ఆ బొమ్మ చేతి వేళ్లను పరిశీలిస్తే మనిషి తరహాలనే ఉండేవి. వాటిపై చిన్న చిన్న వెంటుకలు కూడా ఉండేవి.

  ఆ రోజుల్లో వ్యాక్స్ బొమ్మలను తయారు చేసేవారు కూడా ఉండేవారు కాదు అంత జీవం ఉట్టిపడే బొమ్మని తయారు చేయటం ఇప్పుడే సాధ్యం కానంత సహజంగా ఆ బొమ్మని తయారు చేయటం అసాధ్యం. ఇప్పటికే అత్యంత సహజత్వం ఉట్టిపడేలా మైనం బొమ్మలు చేసే టుస్సాడ్స్ మ్యూజియం లోని బొమ్మలు కూడా ఈ బొమ్మ అంత సహజంగా ఉందవు. అందువల్లే అది బొమ్మ కాదు. దుకాణం యజమాని కూతురి శవమే అనే అనుమానాలు అందరికీ బలపడ్డాయి.

   ఆ బొమ్మ ఇప్పటికీ అదే దుకాణంలో ఉంది. మెక్సికోలో మాత్రం ‘లా పస్క్యూలిటా’ పేరు వింటే చాలు అంతా ఈ బొమ్మ(?) గురించే చెబుతుంటారు. ఇక ఆ బొమ్మ అప్పుడప్పుడూ కదులుతోందీ, తను చూసే దిశ మార్చుకుంటుందనీ,  కొన్నిసార్లు  కళ్ళు ఆర్పుతుందనీ రకరకాల రూమర్లు పుట్టుకొచ్చాయి.  అయితే ఈ బొమ్మని గురించిన అసలు నిజాలు ఆ షాపు యజమానికి మాత్రమే తెలుసు. కానీ అతను మాత్రం అది బొమ్మ మాత్రమే అని చెబుతున్నాడు. నిజానిజాలు పక్కన పెడితే కూతురు శరీరాన్ని అలా దాచుకోవటాన్ని ప్రేమ అనుకోవచ్చా? జనమంతా వణికి పోతూ కూడా ఆ షాపుకు వెళ్ళి వింతగా చూస్తూ ఆ బొమ్మ మీద రకరకాల వాత్రలని ప్రచారం చేయటం సరైందేనా? చిన్న వయసులోనే మరణించి అలా బొమ్మలా నిలబడ్డ పస్క్యులిటా ఆత్మ (ఒకవేళ ఆత్మలు ఉంటే) ఏమనుకుంటుంది???