"ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్" తెలుగు ట్రైలర్ : కీలుబొమ్మ కథ అంటూ...

07:10 - January 10, 2019

 

 

 

 

 

 

 

 

 

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్’. విజయ్‌ రత్నాకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.  ఇందులో మన్మోహన్‌ సింగ్ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌ నటించారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన వద్ద జాతీయ భద్రతా సలహాదారుడిగా వ్యవహరించిన సంజయ్‌ బారూ. మన్మోహన్‌ జీవితాధారంగా రాసిన ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ అనే బయోగ్రఫీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రైలర్‌ విడుదలయ్యాక సినిమాపై కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమాను ముందు తమకు చూపించాల్సిందిగా డిమాండ్‌ చేసింది. తాజాగా రిలీజైన మన్మోహన్ బయోపిక్ తెలుగు ట్రైలర్ కూడా ఆసక్తి కరంగానె ఉంది. కాకపోతే కాంగ్రేస్ పార్టీని పనిగట్టుకొని విమర్షించటానికే ఈ సినిమా తీసినట్టు అర్థమైపోతోంది.

              "నాకైతే డాక్టర్ సింగ్ ఎలాంటి లోపం లేని భీష్ముడిలా కనిపిస్తారు. పాపం ఫ్యామిలీ డ్రామాకి బలైపోయారు" అంటూ అతడి వ్యక్తిగత పీఏ బారువా డైరెక్టుగానే మన్మోహన్ లోని గొప్ప క్వాలిటీని డైలాగ్ రూపంలో చెప్పాడు. "మహాభారతంలో రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి.. కానీ ఇండియాలో ఒక్కటే" అంటూ ఇంకా గాంధీల వారసత్వ పాలనపైనా పంచ్ వేసే ప్రయత్నం చేశారు.  "ప్రైమ్ మినిస్టర్ ఏం చేయాలో ఎంబసీనా నిర్ణయించేది?" అంటూ మన్మోహన్ ఆవేదన చెందే సన్నివేశం. చూడగానే "మాజీ ప్రధాని కీలుబొమ్మ కథ" అనే లైన్ ఎందుకు వాడారో తెలిసిపోయింది.  
          దేశ అణు ఒప్పందం విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి వస్తే.. కశ్మీర్ సమస్యను పరిష్కరించాలనుకుంటే..! అందుకు సోనియా అడ్డుపడ్డట్టుగా తెరపై చూపిస్తున్నారని అర్థమవుతోంది. స్వతంత్రంగా ఉండి నిర్ణయాలు తీసుకోలేనప్పుడు దేశానికి కలిగే ముప్పు ఎలాంటిదో గ్రహించి రాజీనామా చేద్దామన్నా కుదరని నిస్సహాయ ప్రధానిగా మన్మోహన్ ని చూపించారు. సింగ్ ని దించేయడమెలా?  ఎప్పుడు పార్టీకి రాహుల్ కి పట్టాభిషేకం చేస్తుందా? అనే దైలాగులూ ఉన్నాయి.  ఈనెల చివరిలో సినిమా రిలీజ్ కానుంది.