ఏసారి ఓటాన్ ఎకౌంటే: కొత్త సర్పంచ్, ఉపసర్పంచ్ లకు కోచింగ్

06:45 - January 12, 2019

తెలంగాణా రాష్ట్రంలో రానున్న పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించే సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వాలని ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. గ్రామాభివృద్ధి విషయంలో వారికి సంపూర్ణ అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కొత్త సర్పంచ్‌లకు విడతల వారీగా పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలని సూచించారు. శుక్రవారం (జనవరి 11) ప్రగతి భవన్‌లో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల శిక్షణ అంశంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించిన సందర్భంగా అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.  


రాష్ట్రంలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి గ్రామానికీ ఒక కార్యదర్శి ఉండేలా పంచాయతీ కార్యదర్శుల నియామకం కూడా జరుగుతున్నది. గ్రామాభివృద్ధిలో వీరిద్దరి పాత్ర చాలా కీలకం.‘ప్రతి గ్రామ పంచాయతీకి కొత్త చట్టం తెలుగు ప్రతులను పంపించాలి. పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు సమన్వయంతో పనిచేయడానికి అవగాహన కల్పించాలి. 


     ఎన్నికయ్యే సర్పంచులు మూస పద్ధతిలో కాకుండా గ్రామాల సమగ్ర వికాసానికి ఉద్యమకారులుగా మారేవిధంగా శిక్షణ ఇవ్వాలి’,   గ్రామ పంచాయతీకి విధులు, బాధ్యతలు అప్పగించే విషయంలో కొంత జాప్యం అనివార్యమవుతున్నది. కేంద్రప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్‌కు పోయే అవకాశం ఉన్నందున. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్‌కే పోతుంది. ఏప్రిల్, మే నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి.

         ఆ తరువాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతాం. అప్పుడే పంచాయతీలకు నిధులు కేటాయించడం సాధ్యమవుతుంది. ఆలోగా సర్పంచులు, కార్యదర్శులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చి, గ్రామాభివృద్ధి కోసం పాటుపడే కార్యకర్తలుగా తీర్చిదిద్దాలి. తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ, ఆస్కి, ఎంసీఆర్‌హెచ్చార్డీ తదితర సంస్థల ద్వారా శిక్షణ ఇప్పించాలి అని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.