భారత్ ముందున్న టార్గెట్ 231 పరుగులు...

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మెల్బోర్న్ వేదికగా ప్రారంభమైన చివరి వన్డేలో ఆస్ట్రేలియా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. భారత బౌలర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఆరు వికెట్లు పడగొట్టి ఆసీస్ వికెట్ల పతనంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఆస్ట్రేలియా 48.4 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. ఇప్పుడు టీమిండియా 231 పరుగులు చేస్తే ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంటుంది. మిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ధాటికి ఓపెనర్లు కారే (5), ఫించ్ (14) స్వల్ప స్కోర్లకే అవుటయ్యారు. 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను మార్ష్, ఖవాజా ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం చాహల్ షో ప్రారంభమైంది. చాహల్ ధాటికి ఖవాజా (34),షాన్ మార్ష్ (39), హండ్స్‌కాంబ్ (58), స్టోయిన్స్ (10), రిచర్డ్సన్ (16), జంపా (8) పెవిలియన్ చేరారు. కెరీర్లో మొదటి సారి ఆరు వికెట్లు దక్కించుకుని చాహల్ సత్తా చాటాడు. ఇక, మ్యాక్స్‌వెల్ (26) , స్టాన్లేక్ (0) వికెట్లను షమీ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే48.4 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లో హాండ్స్‌కాంబ్ (58) మాత్రమే అర్ధశతకం సాధించాడు. మిగిలిన వారిలో షాన్ మార్ష్ (39), ఖవాజా (34) చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. భారత బౌలర్లలో చాహల్ ఆరు వికెట్లు పడగొట్టగా, షమీ, భువీ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు.