టీడీపీలో టిక్కెట్‌ ఇస్తామన్నా...ఒద్దు బాబూ అంటున్న ఎమ్మెల్యే

14:00 - March 19, 2019

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎలక్షన్లు రెండూ ఒకేసారి జరుగుతున్న వేళ ఏపార్టీలో సీటు ఇస్తారా అంటూ ఎదురుచూస్తుండేవారు చాలా మంది వుంటారన్న విషియం తెలిసిందే. కానీ టీడీపీలో ఇందుకు రివర్స్‌ జరుగుతుంది. వివరాల్లోకి వెలితే...కర్నూలు జిల్లా బనగాన పల్లి సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి తాను టీడీపీ నుంచి పోటీచేయనని టికెట్ ఇచ్చిన తరువాత బరిలోంచి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం లేకపోలేదు. అయిదేళ్లలో టీడీపీపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని.. తాను పోటీచేసినప్పటికీ గెలువలేనని.. ఓటమి ఖాయమనే ఆందోళనతోనే బీసీ జనార్ధన్ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి బనగానపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి టీడీపీ అదే సీటును ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేటాయించింది. 

గతంలో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో బనగానపల్లి నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి పోటీచేసిన కాటసాని రామిరెడ్డి విజయం సాధించారు. అనంతరం 2014 ఎన్నికల్లో కాటసాని వైసీపీలో చేరి పోటీ చేశాడు. అదే 2014లో టీడీపీ తరుఫున నిలబడ్డ బీసీ జనార్ధన్ రెడ్డి జిల్లాలో వైసీపీ గాలి  వీచిన తట్టుకొని నిలబడి కాటసానిని ఓడించాడు. ఇప్పుడు కూడా వైసీపీ తరుఫున కాటసాని నిలబడగా.. టీడీపీ నుంచి బీసీ జనార్ధన్ రెడ్డి పోటీచేస్తున్నారు. సీఎం చంద్రబాబు తొలి జాబితాలోనే ఈయనకు టికెట్ ఇచ్చాడు. కానీ నియోజకవర్గంలో పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఈసారి ఓటమి ఖాయమనే అంచనాతో పోటీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. నామినేషన్లకు ఇంకా ఐదు రోజులే గడువు ఉంది.  ఇప్పుడు బీసీ జనార్ధన్ రెడ్డి ఆకస్మికంగా తప్పుకోవడంతో టీడీపీకి అభ్యర్థి లేని పరిస్థితి. ఇప్పుడు కొత్త ముఖం కోసం టీడీపీ వెతుకులాట ప్రారంభించిందట.