బాలయ్యపై మహిళలు ఆగ్రహం: ఖాళీ బిందెలతో నిరసన

11:39 - April 5, 2019

తన మాటలతో ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకునే బాలయ్యకు ఈసారి చేదు అనుభవం ఎదురైంది. అభిమానంతో తాగినా, సెల్ఫీ దిగాలనుకున్నా ఆయన నోటి దురుసుతో ఎప్పుడూ కూడా ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివాదాలకు కేరాఫ్‌గా మారారు బాలయ్య. అయితే ప్రస్తుత వివరాల్లోకి వెలితే...ఓట్లు అడిగేందుకు హిందుపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న బాలకృష్ణ.. చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి ఎస్సీ కాలనీకి వెళ్లారు. అక్కడి మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. నీళ్లు ఇవ్వరు కానీ.. ఓట్లు అడిగేందుకు ప్రచారానికి వస్తారా? అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకున్న తాగునీటి సమస్యను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం..స్థానిక నాయకత్వం విఫలమైన నేపథ్యంలో.. వారు బాలకృష్ణ ప్రచారానికి నిరసన తెలిపారు.  దీంతో కంగుతిన్న బాలయ్య.. స్థానిక నాయకత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదంటూ ఫైర్ అయ్యారు. హిందూపురంలో గెలిచిన నాటి నుంచి చుట్టం చూపుగా నియోజకవర్గానికి రావటం.. ఒకవేళ వచ్చినా హడావుడిగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టటమే తప్పించి స్థానిక నాయకత్వంతో కూర్చొని సమస్యల మీద ఎప్పుడూ మాట్లాడింది లేదని.. ఇప్పుడు తమపై మండిపడటంపై తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.