ఆ నలుగురునీ ఒదిలేది లేదు: తనూశ్రీ

12:43 - January 25, 2019

2018లో మీటూ ఉద్యమాన్ని పరాకాష్టకు చేర్చిన ఘనత తనూశ్రీ దత్తాదే. నటుడు నానా పటేకర్ సహా `హార్న్ ఓకే ప్లీజ్` సినిమా నిర్మాత సామి సిద్ధిఖీ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య రాకేష్ సారంగ్ వంటి ప్రముఖులు వేధించారంటూ తనూశ్రీ తీవ్ర ఆరోపణలు చేసింది. వేధింపుల ఫర్వానికి ఆ నలుగురు సాక్షి అంటూ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యింది. ఆ నలుగురి వేధింపుల గురించి ఇదివరకూ ఓ సుదీర్ఘమైన లేఖ రాసిన తనూశ్రీ తాజాగా మరోసారి లేఖాస్త్రాన్ని సంధించింది. అప్పుడు నా వయసు కేవలం 24 మాత్రమే. బాలీవుడ్ లో నా కెరీర్ రైజింగ్ లో ఉందప్పుడు. ఆ టైమ్ లో నాపై లేనిపోని తప్పుడు వార్తల్ని ప్రచారం చేశాడు గణేష్ ఆచార్య. చిలువలు పలువలుగా కట్టుకథలు అల్లి కెరీర్ నాశనం చేసేందుకు చూశాడు. దానిని ఓ క్యాంపెయినింగ్ లా చేపట్టాడు. వీళ్లతో పాటే రాఖీ సావంత్ నాపై దుర్మార్గంగా ప్రవర్తించింది. 10ఏళ్ల నాటి ఈ ఘటన తర్వాత నేను ఇంకా బతికే ఉన్నానా.. అన్న ఆశ్చర్యం కలిగింది. గత ఆరు నెలలుగా ఇండియాలోనే ఉండి .. వర్క్ ప్లేస్ మహిళలపై వేధింపుల విషయమై పోరాడుతూనే ఉన్నాను.. అని అంది. `హార్న్ ఓకే ప్లీజ్` చిత్రానికి నన్ను రికమండ్ చేసింది గణేష్ ఆచార్య. అయితే అతడు వేధింపుల వేళ నానా పటేకర్ ని కాపాడేందుకు ప్రయత్నించాడు. అందుకే ఎఫ్ ఐఆర్ లో గణేష్ ఆచార్య పేరు ప్రముఖంగా ఉంది. నన్ను కేవలం ఒక్కరే వేధించలేదు. నలుగురు కలిసి వేధించారు అని తనూశ్రీ చెప్పకొచ్చింది. అంతేకాక...నానా రాకేష్ సారంగ్ సామీ సిద్ధిఖి రాఖీ వీళ్లందరికీ ఇదే నా శాపం. వీరితో కలిసి ఉన్న కుటుంబం పిల్లలు పని చేసేవాళ్లు అందరూ మెంటల్ గా బాధలకు గురవుతారు. అంతేకాదు మీకు పుట్టే మొదటి సంతానం కూతుళ్లు కొడుకులు మెంటల్ ఫిజికల్ టార్చర్ అనుభవిస్తారు. ఈ శాపం తప్పకుండా తగిలి తీరుతుంది. అనుభవించి తీరతారు. పండిత పురోహితుల పూజలు సైతం మిమ్మల్ని కాపాడలేవు. దేవుళ్లు దేవతలు సైతం మిమ్మల్ని కాపాడలేరు. ఈ శాపానికి తిరుగే లేదు!! అంటూ తనూశ్రీ శాపనార్థాలు పెట్టింది.