"యాత్ర"పై పైరసీ పంజా: కొన్ని గంటల్లోనే నెట్ లో లీక్ చేసిన తమిళ్ రాకర్స్

23:59 - February 9, 2019
*వైఎస్సార్ సినిమా "యాత్ర"పై పైరసీ పంజా 
 
*టాలీవుడ్ లోనూ మొదలైన తమిళ్ రాకర్స్ దాడి 
 
*కథానాయకుడు తో మొదలై ఇప్పుడు రిలీజ్ రోజునే "యాత్ర" లీక్ 

 

 

ఒకప్పుడు పేరుకు తగ్గట్టు తమిళ సినిమాలకు మాత్రమే పరిమితం అయిన పైరసీ వెబ్సైట్ "తమిళ్ రాకర్స్" నెమ్మదిగా దాని పరిధిని విస్తరించుకుంటూ వస్తోంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి కూడా ఈ మహమ్మారి వచ్చేసింది. ఒకప్పుడు కాస్త సమయం తీసుకుని పైరసీ సినిమాలు మార్కెట్ లొకి తెచ్చే ఈ వెబ్సైట్లు ఇప్పుడు ఏకంగా సినిమా రిలీజ్ రోజునే పైరసీ చేసే స్థాయికి ఎదిగి పోయాయ్.

ఇప్పుడు తమిళ్ రాకర్స్ ఇండియన్ పైరసీవరల్డ్ లొనే నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ టేబుల్ మీద ఉందగానే సినిమాని కాపీ చేసేయగల నెట్వర్క్ ఈ సంస్థ సొంతం. సూర్య నటించిన "సింగ 3, రోబో2.0"సినిమాలని ఏకంగా ముందే సవాల్ చేసి మరీ రిలీజ్ రోజే లీక్ చేసేసారు. గత సంవత్సరం ఈ వెబ్ సైట్ మీద పెద్ద యుద్దమే చేసిన తమిళ హీరో విశాల్ చొరవ తీసుకొని ఈ వెబ్సైట్ ఆటకట్టించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. పైగా అప్పటినుంచే మరింత విజృంబించేసింది కూడా.


    ఇప్పుడు ఈ లీకువీరుల దృష్టి టాలీవుడ్ మీద కూడాపడింది ఈ వెబ్ కి బలైన మొదటిసినిమా ఎన్టీఆర్ బయోపిక్ "కథానాయకుడు" కాగా మిగతా సినిమాలని కూడా నెమ్మదిగా లీక్ చేయటం మొదలు పెట్టింది. ఇప్పుడు తాజాగా శుక్రవారం (2-9-2019)రోజున విడుదలైన "యాత్ర"ని కూడా ఒక్కరోజు దాటకుందానే కొన్ని గంటలలోపే పైరసీ కాపీ తెచ్చేసి టాలీవుడ్ కీ సవాల్ విసిరింది. ఉమ్మడిఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే.

ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ఇందులో వైఎస్సార్‌గా మలయాళ సూపర్‌స్టార్ ముమ్ముట్టీ జీవించారని, తమ నేతను మళ్లీ గుర్తుకుతెచ్చారని వైఎస్ అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇందులో వైఎస్ ఆత్మ కేవీపీ పాత్రలో రావు రమేష్, వైఎస్ రాజారెడ్డిగా జగపతిబాబు, చేవెళ్ల చెల్లెమ్మ సబిత పాత్రలో సుహాసిని తదితరులు నటించారు. మహి వి.రాఘవ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.  అయితే విడుదలైన కొన్ని గంతలలోనే తమిళ్ రాక‌ర్స్ తో పాటు మ‌రికొన్ని వెబ్ సైట్ల‌లో పైర‌సీ ప్ర‌త్య‌క్షం కావ‌డంతో ఇప్పుడు ఆ లింక్ కూడా తీసే ప‌రిస్థితి లేదు. అసలే మంచి టాక్ వస్తున్న సందర్భంలో ఇలాంటి షాక్ తగక్లటంతో ఎటూ దిక్కుతోచని స్థితిలో పడ్డారట నిర్మాతలు.