తెలుగులోనూ పంజా విసిరినా తమిళ్ రాకర్స్: తొలిదెబ్బ బాలయ్య సినిమా మీదే

14:35 - January 10, 2019

నిన్నా మొన్నటి వరకూ తమిళ ఇండస్ట్రీని మాత్రమే గడగడలాడించిన మూవీ పైరసీ మాఫియా దిగ్గజం "తమిళ్ రాకర్స్" దృష్టి ఇప్పుడు తాలీవుడ్ లోకీ అడుగు పెట్టింది. ఒకప్పుడు ఈ వెబ్సైట్ పేరు వింటే చాలు కోలీవుడ్ నిర్మాతలూ, నటులూ బెంబేలెత్తిపోయేవాళ్ళూ ఒకటిన్నర సంవత్సరం క్రితం ఒక భారీ స్థాయి ఆపరేషన్ నిర్వహించి మరీ దీనికి బాధ్యులైన వారిలో ఇద్దరిని అరెస్ట్ చేసారు కూడా. అప్పట్లో హీరో విశాల్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని మరీ ఈ వెబ్సైట్ ఆటకట్టించటం లో కీలక పాత్ర పోషించాడు. 


    ఆ తర్వాతైనా ఈ సైట్ ఇక ఆగిపోతుందేమో అనుకుంటుండగా విడుదలకు ముందే హీరో సూర్య "సింగం 3" సినిమాని ఆన్లైన్లో రిలీజ్ చేసేసారు. అదీ క్లారిటీ ఉన్న ప్రింట్ తో. ఆ తర్వాత రోబో 2.0 సినిమానుకూడా ముందుగా చెప్పి మరీ లీక్ చేసేసారు. అదీ హై రిజల్యుషన్ ప్రింట్ తో.  ఇక ఇప్పుడు ఈ మఫియా దృష్టి టాలీవుడ్ మీద కూడా పడింది.మొదటి దెబ్బ నందమూరి బాలయ్య సినిమా "కథానాయకుడు" మీదనే పడింది. 


                   బాలకృష్ణ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రం బుధవారం విడుదలై మంచి సక్సెస్ టాక్‌తో నడుస్తోంది. పాత్రలన్నింటినీ స్టార్ యాక్టర్స్‌తో చేయించడంతో సినిమాపై క్రేజ్ బాగా ఏర్పడింది.  అయితే ఈ చిత్రం విడుదలై కొన్ని గంటలు కూడా గడవకముందే ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. తమిళ్ రాకర్స్ ఇక్కడకూదా వచ్చీ రావటం తోనే ఇంతపెద్ద సినిమాతోనే మొదలు పెట్టారంటే ఇక మామూలు సినిమాల గురించి చెప్పేదేముంది?

    అయినా కోట్లకు కోట్ల రెమ్యున రేషన్లతో, "నిర్మాణ విలువలు" అనే మాట చెబుతూ సినిమా వ్యయాన్ని విపరీతంగా పెంచేసి టికట్ రేట్లని సామాన్యుడు కొనలేని స్థాయిలో పెంచేసాక. జనం పైరసీ వరకు చూడకపోతే ఏం చేస్తారు? అంతా చేసి 1000, 500 రూపాయలు ఖర్చు చేసి వెళితే ఆసినిమాలు కాస్తా విషయం లేకుండా అట్టర్ ఫ్లాప్ అవుతున్న అనుభవాలను చూసాక. పైరసీ వైపు కాకుంటే ఎటు చూస్తారు?  
సరైన ధరల్లో టికెట్లు అందుబాటులోకి వస్తే ఎన్ని తమిల్ రాకర్స్ వచ్చినా.. థియేటర్లో సినిమా చూడాలన్న కోరికను చంపుకొని పైరసీ వైపుకి ప్రేక్షకుడు మాత్రం ఎందుకు వెళతాడు?  ఇంతకీ పైరసీ విషయంలో తప్పు ఎవరిదగ్గరుంది... ఒకసారి ఆలోచిస్తే మంచిదేమో