నీకు సిగ్గులేదా?, మొక్కులకు వచ్చి రాజకీయాలు చేస్తున్నారా?: తలసాని, చంద్ర బాబుల మాటల యుద్దం

02:27 - January 18, 2019

ఇద్దరు నేతల మాటల యుద్దం రెండు రాష్ట్రాల రాజకీయాలని ఒక్కసారి వేడేక్కించింది. టీఆరెస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆంధ్రప్రదేష్ ముఖ్యమంత్రి చంద్రబాబూ పరస్పరం మాటల దాడి చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఓడించేందుకు ఎన్టీఆర్‌ అభిమానులు సిద్ధంగా ఉన్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ విషయమై చర్చించేందుకు వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో.. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బుధవారం భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలపై తలసాని మండిపడ్డారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో తలసాని మాట్లాడుతూ.. ఏపీ హక్కుల కోసం టీఆర్‌ఎస్‌ పార్టీ పోరాడుతుందని తెలిపారు. 


  ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడిన 26 కులాలకు తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని చంద్రబాబు మాట్లాడుతున్నారని, కానీ తమకు చిత్తశుద్ధి ఉందికాబట్టే ఆ 26 కులాలను కూడా బీసీ కమిషన్‌కు పంపించామనిచెప్పిన తలసాని  . చంద్రబాబులాంటి మోసపూరిత జీవితం తమకు లేదని. ఏది చేసినా రాజకీయాలతో ముడిపెట్టే అలవాటు, చిల్లర రాజకీయాలు చేయటం లేదని చెబుతూ "ఏపీని బాగా అభివృద్ధి చేస్తున్న సుందరాంగుడు ఈ చంద్రబాబు అంట.. మేమేదో అడ్డుకుంటున్నామట. అసలు ముఖ్యమంత్రిగా ఉండి ఆ మాటలు మాట్లాడేందుకు సిగ్గులేదా" అంటూ విరుచుకు పడ్డారు. ఏదో ఏపీలో చిల్లర రాజకీయాలు చేస్తే ఎవరూ ఏమీ అనరేమో కానీ, మా దగ్గర  దానికి సమాధానాలు చాలా సీరియస్‌గా ఉంటాయని కూడా అనేశారు. 

అయితే ఈ వ్యాఖ్యలకు ఏపీ సీఎం చంద్రబాబుకూడా అదేస్థాయిలో మాటల దాడి చేసారు..ఎలక్షన్ మిషన్ 2019పై టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఆలయాల్లో మొక్కులకు వచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేస్తారా..? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ నేతల ఏపీ పర్యటనల్లో టీడీపీ నేతలు పాల్గొనరాదని. ఎవరైనా పాల్గొంటే కఠినంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు. బంధుత్వాలు, స్నేహాల పేరుతో పార్టీని ఫణంగా పెట్టొద్దన్నారు. ప్రజా ప్రయోజనాలను దెబ్బ తీసే చర్యలను సహించేది లేదన్నారు. తెలంగాణలో జాబితా నుంచి 26 కులాలను తొలగించి బీసీలకు అన్యాయం చేశారని... ఇక్కడికి వచ్చి అదే బీసీలపై కపటప్రేమ చూపిస్తున్నారని సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మొత్తానికి ఈ ఇద్దరు నాయకుల మాటలతో రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చిన్న సైజు దుమారమె రేగుతోంది.