ఊరికోసం ఐర్లండులో ఉధ్యోగం వదిలేసి వచ్చేసింది: సర్పంచ్ ఎన్నికల కోసమే

05:27 - January 16, 2019

తెలంగాణా ఎన్నికల నేపథ్యం లో అవాక్కయ్యే సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ ఉన్న యువకులే రాజకీయాలంటే మొహం మొత్తెసి ఉధ్యోగాలూ, కెరీర్ అంటూ పరుగులు తీస్తూంటే. విదేశాల్లో ఉన్న జాబ్ వదులుకొని మరీ ఇక్కడికి వచ్చి గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీకి నిలుచున్న ఆ అమ్మాయిని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. నిజామాబాద్ జిల్లా ఈ పరిణామం చోటు చేసుకుంది. సర్పంచ్ పదవి కోసం ఓ యువతి ఐర్లాండ్ దేశంలో ఉద్యోగాన్ని వదిలి స్వగ్రామానికి వచ్చింది.


       నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లికి చెందిన సుస్మిత నాయుడు ఐర్లాండ్ లోని డబ్లిన్ బిజినెస్ స్కూల్ లో ఎంబీఏ పూర్తిచేసి అక్కడే హెచ్ సీఎల్ టెక్నాలజీస్ సర్వీసెస్ లో టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్ గా ఉద్యోగాన్ని సాధించి ఏడాదిగా ఉద్యోగం చేస్తున్న సుస్మిత తెలంగాణా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు. ఎడపల్లి సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలుచేశారు.  


  సుస్మిత 1994 సెప్టెంబర్ 12న జన్మించారు. బోధన్ లోని ఇందూర్ మోడల్ స్కూల్ లో ఎస్సెస్సీ - విద్యావికాస్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ హైదరాబాద్ అరోరా డిగ్రీ కాలేజీలో బీబీఏ అభ్యసించారు. ఉన్నత చదువుల కోసం ఐర్లాండ్ వెళ్లారు. సుస్మిత తండ్రి శంకర్ నాయుడుకు కూడా రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన గతంలో బోధన్ చెరుకు అభివృద్ధి మండలి చైర్మన్ గా - 1995 - 2013లో జరిగిన ఎడపల్లి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా ఎన్నికయ్యారు. 2001లో ఎడపల్లి ఎంపీటీసీగా గెలుపొందారు.