ఈ సంవత్సరం అదరగొట్టబోతున్న సూర్య...

12:44 - January 2, 2019

తమిళ స్టార్ హీరో సూర్య ఈమద్య కాలంలో ఫ్యాన్స్ ను పూర్తి స్థాయిలో మెప్పించలేక పోయాడు. పోయిన సంవత్సరం సూర్యకు అంతగా కలిసి రాలేదని చెప్పాలి. అయితే 2019లో మాత్రం సూర్య మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూర్య నటిస్తున్న ‘కాప్పాన్’ చిత్రం ఫస్ట్ లుక్ ను కొత్త సంవత్సరం కానుకగా విడుదల చేశారు. ఫస్ట్ లుక్ విడుదల తర్వాత ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ భారీ బడ్జెట్ సినిమా విడుదల తేదీపై అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ లుక్ లో సూర్య కాప్ గా కనిపిస్తున్నాడు. కేవీ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కీలక పాత్రల్లో మోహన్ లాల్ మరియు ఆర్యలు నటిస్తున్నారు. ప్రధాన మంత్రి పాత్రలో మోహన్ లాల్ కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. పీఎం సెక్యూరిటీ ఆఫీసర్ గా సూర్య కనిపించబోతున్నట్లుగా తమిళ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో నటించే అవకాశం అల్లు శిరీష్ కు దక్కింది. కాని తెలుగులో చేస్తున్న సినిమా డేట్లతో క్లాష్ రావడంతో సూర్య మూవీని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఒకవేళ శిరీష్ ఈ చిత్రంలో నటిస్తే ఆర్య స్థానంలో శిరీష్ ఉండేవాడేమో.