పాకిస్తాన్ లో తోలి హిందూ మహిళా జడ్జి : చరిత్ర సృష్టించిన సుమన్ కుమారి

16:10 - January 29, 2019

పాకిథాన్ అనగానె అక్కడ ఉన్నవారంతా ముస్లింస్ మాత్రమే అన్న భావన మాత్రమే కాదు వారంతా భారత దేశాన్ని అసహ్యించుకునే వాళ్ళే అనుకోవటం మామూలైపోయింది. ఇక అక్కడ ఉన్న హిందువుక్లంతా విపరీతమైన కష్టాల్లో ఉన్నారూ అనుకోవటం కూడా. అయితే భారత దేశం లోని మైనారీతీల లాగే పాకిస్థాన్ లోని హిందూ మైనారిటీల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. పాకిస్తాన్‌ జనాభాలో 2శాతం హిందూ సామాజిక వర్గానికి చెందిన వారున్నారు.

అంతేకాదు ఇస్లాం మతం తర్వాత పాకిస్తాన్‌లో అత్యధికంగా హిందూ మతమే ఉంది. నాడు దేశ విభజన సమయంలో చాలామంది భారత్‌ను వీడి పాకిస్తాన్‌కు వెళ్లిపోయారు. ముఖ్యంగా మొహ్మద్ జిన్నా అడుగుజాడల్లో నడిచినవారు చాలామంది పాకిస్తాన్‌కు వెళ్లి సెటిల్ అయ్యారు. అందులో ఎక్కువగా ముస్లిం సామాజికవర్గం వారే ఉన్నారు. ఇక దేశవిభజనకు ముందు నుంచి అక్కడే ఉన్న హిందువులు దేశ విభజన సమయంలో వారి ఆస్తులను వదులుకుని భారత్‌లోకి వచ్చేందుకు ఇష్టపడకపోవడంతో వారు అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు ఈ లెక్కలన్నీ ఎందుకూ అంటే... 


పాకిస్థాన్‌లో జడ్జిగా నియమితురాలైన తొలి హిందూ మహిళగా సుమన్ కుమారి నిలిచారు. ఖంబర్-షాదాద్‌కోట్‌కు చెందిన ఆమె తన సొంత జిల్లాలోనే సివిల్ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌లో ఆమె తన ఎల్‌ఎల్‌బీ చేశారు. కరాచీలోని షాబిస్త్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. ఖంబర్-షాదాద్‌కోట్‌లోని పేదలకు ఉచితంగా న్యాయ సాయం చేయడమే ఆమె లక్ష్యమని సుమన్ తండ్రి పవన్ కుమార్ బోడన్ చెప్పారు.

ఈయన ఓ కళ్ల డాక్టర్. సుమన్ కుమారి అక్క ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాగా.. మరో సోదరి చార్టర్డ్ అకౌంటెంట్. తమ కేసులు వాదించేందుకు లాయర్లు ఎక్కువగా ఫీజులు తీసుకుంటుండటంతో అంత ఫీజులు చెల్లించలేక పోతున్న పేదలకు ఉచితంగా కేసులు వాదించేదని సుమన్ తండ్రి పవన్ కుమార్ బోదన్ చెప్పారు. సుమన్ ఎంచుకున్న ఉద్యోగం కష్టమైనదే అయినప్పటికీ ఆమె కష్టపడేతత్వం, నిజాయితే ఆమెకు రక్షణగా నిలుస్తుందని పవన్ కుమార్ అన్నారు. 

పాక్ లో మొదటి హిందూ మైనారిటీ జడ్జి ఇదే మొదటిసారి కాదు 2005 నుంచి 2007 మధ్య హిందూ సామాజిక వర్గానికి చెందిన జస్టిస్ రాణా భగ్వాన్ దాస్ పనిచేశారు. అయితే ఆయన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు. కానీ ఒక హిందూ మహిళ ఈ స్థాయిని అందుకోవటం రికార్డ్ గానే చెప్పుకోవచ్చు.