ఆ హీరోలకు ఏమైనా అయితే జేడీఎస్‌దే బాధ్యత: సుమలత

15:52 - April 22, 2019

కన్నడ నాట రాజకీయ వైరుధ్యాలు శృతిమించుతున్నాయని వాపోయారు దివంగత కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ భార్య సుమలత. ఇటీవల ఎన్నికల్లో సుమలత తరుఫున ప్రచారం చేసిన హీరోలు యష్ - దర్శన్ సహా అందరు నటులు భవిష్యత్ లో ప్రశ్చాత్తాపడుతారని కొందరు జేడీఎస్ నేతలు అనడం సంచలనంగా మారింది. మాండ్యా నుంచి లోక్ సభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న ఈమెను టార్గెట్ చేసిన అధికార జేడీఎస్ ఆమెను ఆమె తరుఫున ప్రచారం చేస్తున్న కన్నడ హీరోలను భ్రయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా దీనిపై సుమలత ప్రశ్నించారు. తన తరుఫున ప్రచారం చేసిన హీరోలను చంపేస్తారా అంటూ ఆమె జేడీఎస్ పై ఫైర్ అయ్యారు. తనకు మద్దతు తెలిపిన వారిని టార్గెట్ చేసి వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. హీరోలకు ఏమైనా జరిగితే జేడీఎస్ దే బాధ్యత అని స్పష్టం చేశారు.నేతల వ్యాఖ్యల వెనుక మర్మాన్ని బయటపెట్టాలన్నారు. సుమలతపై సానుభూతి వెల్లివిరిసింది. ఆమెను ఓడించడానికి అధికార జేడీఎస్ చాలా ప్రయత్నాలు చేసింది. మద్దతిచ్చిన కన్నడ హీరోలను బెదిరించారు. అయినా వెరవకుండా సుమలత పోరాడింది. ఇప్పుడు వీరి ఫైట్ లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది.