పరీక్ష తప్పుతానేమోనని, పురుషాంగం కోసుకుని విద్యార్ధి ఆత్మహత్యా యత్నం

03:49 - March 13, 2019

*పరీక్ష తప్పుతానన్న భయంతో ఆత్మహత్యా యత్నం 

*బ్లేడుతో గొంతు, చెయ్యి, మర్మాంగం కోసుకుని 

*చికిత్స పొందుతున్న నల్గొండ విద్యార్ధి 

 

పరీక్ష సరిగా రాయలేదని, ఇంట్లో తిడతారనీ భయపడ్డాడు. ఆ భయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు అయితే ఆ ప్రయత్న విఫలమబ్వ్వటమే కాదు ఇప్పుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. అయితే ఆత్మహత్య కోసం ఆ విధ్యార్థి ఎంచుకున్న మార్గమే దారుణంగా ఉంది. ముందు గొంతు కోసుకోని తర్వాత చెయ్యికోసుకొని అప్పటికీ తాను చనిపోనేమోనన్న అనుమానంతో మర్మాంగాన్ని కూడా బ్లేడుతో గాయపరుచుకున్నాడు. అయినా అతను మరణించకపోగా ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. 


 నల్గొండ ప్రగతి కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ మైనర్ విద్యార్థి సోమవారం ఉదయం ఫిజిక్స్ పరీక్ష రాశాడు. కానీ ఆ పరిక్ష సరిగా రాయలేకపోవటంతో ఇంట్లో మందలింపులకు భయపడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆ బాలుడు. బ్లేడుతో గొంతుకోసుకోవాలని నిర్ణయించుకొని. సోమవారం సాయంత్రం స్నేహితుడిని కలవడానికి వెళ్తున్నానని చెప్పి కాలేజీ హాస్టల్నుంచి నల్గొండలోని పాలిటెక్నిక్ కాలేజీ సమీపంలో ఉన్న పార్క్‌లోకి వెళ్లి చీకట్లో తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో గొంతు కోసుకున్నాడు.

దాంతో  తీవ్ర రక్తస్రావమవడంతో స్పృహ కోల్పోయి రాత్రంతా అక్కడే ఉండిపోయాడు. అయితే రక్తస్రావం అయితే జరిగింగింది గానీ అతని ప్రాణం మత్రం పోలేదు. ఉదయం స్పృహ నుంచి తేరుకొని చూసేసరికి బతికే ఉండటంతో మరింత ఆందోళనకు గురయ్యాడు. వెంటనే బ్లేడు తీసుకొని చేతి మణికట్టుపై కోసుకున్నాడు. అప్పటికీ చనిపోనేమోనని భావించి పురుషాంగంపై కోసుకున్నాడు. అయితే మార్నింగ్ వాక్ కోసం పార్క్ కి వచ్చిన కొందరు  ఆ బాలుణ్ని గమనించి పోలీసులకు సమాచారం అందించటంతో విద్యార్థిని వెంటనే ఆస్పత్రికి తరలించిన పోలీసులు అతని వివరాలు సేకరించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
   అయితే ఆత్మహత్య అంటే మరింతగా తిడతారేమోనన్న భయంతో మొదట తనమీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి బ్లేడుతో గాయపరిచారని తప్పుడు సమాచారం ఇచ్చిన విధ్యార్థి తర్వాత పోలీసులు గట్టిగా అడగటంత్తో పరీక్ష తప్పుతానేమొనన్న భయంతో తానే ఆత్మహత్యకు ప్రయత్నించానని నిజం చెప్పేసాడు. దాంతో కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బాధిత విద్యార్థికి ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని, అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.  మొత్తానికి ప్రమాదం నుంచి బయట పడ్డ విధ్యార్థి ఇప్పుడు కోలుకుంటున్నాడు.