ఆర్ఆర్ఆర్‌లోకి :మరో ఇద్దరు బాలీవుడ్ నటులు

17:08 - March 24, 2019

*రోజుకో సంచలనం సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్‌

*మరో ఇద్దరు బాలివుడ్ నటులు 

*ప్రాజెక్ట్ లోకి వరుణ్ దావన్, సంజయ్ దత్ 

 

రాజమౌళి ఈ పేరు ఇప్పుడు కేవలం టాలీవుడ్ ఖాతాలోనిది మాత్రమే కాదు. ఇండియన్ మూవీ ఇండస్ట్రీలన్నీ ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం చూస్తున్నాయి. బాహుబలి సిరీస్ తో దాదాపు భారత దేశ అగ్ర దర్శకుల్లో ఒకడి గా చేరిన రాజమౌళి ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌ కోసం చేస్తున్న చిన్న అప్డేట్స్ కూడా మంచి వార్తలుగా వైరల్ అవుతున్నాయి. 
        చిత్రానికి దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ క‌లిగించేందుకు ఈ మూవీలో ప‌లువురు బాలీవుడ్ స్టార్స్‌ని రాజ‌మౌళి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. అజ‌య్ దేవ‌గ‌ణ్‌, అలియా భ‌ట్‌లు ఆర్ఆర్ఆర్‌లో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తుండ‌గా, తాజాగా సంజ‌య్ ద‌త్, వ‌రుణ్ ధావ‌న్‌లు ఈ చిత్రంలో భాగం కానున్నార‌నే టాక్ వినిపిస్తుంది. ఇటీవ‌ల రాజ‌మౌళి వారిని సంప్ర‌దించ‌గా, ఆర్ఆర్ఆర్‌లో న‌టించేందుకు వారు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని అంటున్నారు. అయితే ఈ విషయం మాత్రం అఫీషియల్ గా ఇంకా ప్రకటించలేదు. 
       ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ పూణేలో జ‌రుగుతుంది. 47 రోజుల లాంగ్ షెడ్యూల్ అక్క‌డ జ‌ర‌ప‌నుండగా, ఇందులో కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తార‌ట‌. అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీం క‌లిసి ఒకే సమయంలో కలిసి పోరాటం చేసి ఉంటే ఎలా ఉండేది అన్న ఫిక్షనల్‌ పాయింట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడిగా విదేశీ భామ డైసీ ఎడ్జ‌ర్ జోన్స్‌ జోడి క‌ట్టింది. జూలై 30,2020న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తేనున్నారు. 

   మరో ఆసక్తిరమైన అప్ డేట్ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఇది స్వతంత్రం రాక ముందు నేపధ్యంలో 1930లో మొదలై ఇప్పటి వర్తమానం దాకా సాగుతుందట. అంటే 2020 వరకు. మొత్తం తొంబై ఏళ్ళ కాలాన్ని రెండు జన్మల థీమ్ మీద రాజమౌళి రాసుకున్నట్టు చెబుతున్నారు. అయితే ఇలాంటి లైన్ మరీ కొత్తదేమీ కాదు. బాలీవుడ్ లో అప్పుడెప్పుడో 90 దశకంలో సల్మాన్ ఖాన్-షారుఖ్ ఖాన్ హీరోలుగా కరణ్ అర్జున్ అనే బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. అదీ ఇలాగే ఇద్దరు అన్నదమ్ములు ఒక జన్మలో విలన్ చేతిలో చనిపోతే మరో జన్మలో వేర్వేరు చోట పుట్టి తర్వాత కలిసి ప్రతీకారం తీర్చుకుంటారు.