అమ్మాయిల డ్రస్‌లపై కామెంట్స్‌: విమర్శలు ఎదుర్కొంటున్న ప్రముఖులు

16:50 - February 5, 2019

వెనుకటికి పెద్దలు అనేవారు...ఏదైనా మనం చూసే దృష్టిని బట్టి వుంటుంది. అది చెడైనా, మంచైనా అని. అయితే ఇప్పుడు కొంత మంది పెద్దలు దానిని మరిచిపోయారో ఏమో తెలియదు కానీ...అమ్మాయిలు వేసుకునే డ్రస్‌ల వల్లనే అన్ని అనర్దాలు జరుగుతున్నాయి అంటూ విమర్శలను ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకి వెలితే...అమ్మాయిలు వేసుకునే డ్రస్‌లపై ఎస్పీ బాలసుబ్రమణ్యం చేసిన వ్యాఖ్యలు విమర్శల పాలు అయ్యాయి. కొన్ని రోజుల క్రితం బాలు ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా ఈమద్య కాలంలో హీరోయిన్స్ ఆడియో వేడుకలకు మరియు ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా స్కర్ట్ లు - పొట్టి దుస్తులు వేసుకు వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మన సాంప్రదాయం కాని విధంగా హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ చేస్తున్నారంటూ బాలు చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్స్ మరియు పలువురు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా వుంటే...దీనిపై తాజాగా జయసుధ స్పందించారు. బాలుగారు అన్నది నిజమే అని - ఒకప్పుడు పొట్టి దుస్తులు వెండి తెరకు మాత్రమే పరిమితం అయ్యేవి. కాని ఇప్పుడు హీరోయిన్స్ వాటిని ఎప్పుడు - ఎలా వేసుకోవాలో మర్చి పోయి పబ్లిక్ గా వాటిని వేసుకుంటున్నారంటూ జయసుధ వ్యాఖ్యలు చేసింది. ఎస్పీ బాలసుబ్రమణ్యం మరియు జయసుధలు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనాలు మమ్ములను మర్చి పోతున్నారనే ఉద్దేశ్యంతో ఈ విధంగా అయినా అటెన్షన్ ను తమపైకి తెచ్చుకునేందుకు వీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా నెటిజన్ లు కామెంట్ చేస్తున్నారు.  తాజాగా నాగబాబు అమ్మాయిల డ్రస్ ల విషయంలో విమర్శలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని - వారిని ఇష్టం వచ్చినట్లుగా డ్రస్ లు వేసుకోనివ్వాలంటూ అమ్మాయిలకు మద్దతుగా  మాట్లాడిన సంగతి తెలిసిందే. ఏదేమయినా అవతలివారు మనం చేసే దృష్టిని బట్టే మంచిగానూ లేదా చెడుగానూ కనిపిస్తారని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.