చింతమనేని నేర చరిత్ర ? ఈసారి సరిగ్గా దొరికాడు అంటూ వైరల్ అవుతున్న పోస్టు

23:03 - February 20, 2019

*సోషల్ మీడియాలో చింతమనేని నేర చరిత్ర 

*1995లో ఏలూరు పోలీస్ ష్టేషన్ లో రౌడీ షీట్ ఓపెన్ చేసారు.

*ఈసారి సరిగ్గా చిక్కాడు ఇతని అరెస్ట్ కి డిమాండ్ చేద్దాం..అంటూ వైరల్ అవుతున్న పోస్ట్ 

 

ఆంధ్ర ప్రదేశ్ లో దళితులని ఉద్దేశించి నిన్న టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యల మీద పెద్ద దుమారమే రేగుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన కుల దురహంకారంతో నిండి ఉన్నాయని, ఈ తరహా దోరణి సరైనది కాదని,తమను అవమానపరిచిన దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌పై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ఆయన తీరును నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి., ఇక సోషల్ మీడియాలో అయితే కేవలం దళితవర్గాల ప్రజలేకాదు కులం ప్రసక్తి లేకుండా అన్ని వర్గాలనుంచీ విపరీతమైన పదజాలంతో విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. ‘మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు’అంటూ ఎమ్మెల్యే దూషించిన ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లు షేర్ చేశారు. గత నెల మొదటివారంలో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో నిర్వహించిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 
   అయితే కావాలనే వైసీపీ సోషల్ మీడియా తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని.. వీడియోను ఎడిట్ చేశారని చింతమనేని జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారట. కానీ ఆయన మాటలని మాత్రం ఎవరూ నమ్మటం లేదు. ఆ వీడియో ఎడిట్ చేసినట్టుగా కనిపించక పోవటమే దానికి కారణం. అంటే కాదు ఇప్పుడు చింతమనేని నేర చరిత్ర అంటూ సోషల్ మీడియాలో మరో పోస్టు హల్ చల్ చేస్తోంది. 95 నుంచీ చింతమనేని మీద వివిద పోలీస్ స్టేషన్లలో ఉన్న కేసులు అంటూ దాదాపు 40 కి పైనే ఆరోపణలతో కూడిన సమాచారం వైరల్ అవుతోంది. ఆ పోస్టు ప్రకారం... చింతమనేని ప్రభాకర్ గారి మీద నమోదైన కేసులు, రౌడీ షీట్ల వివరాలు.

1995లో ఏలూరు పోలీస్ ష్టేషన్ లో రౌడీ షీట్ ఓపెన్ చేసారు.

1. ఎఫ్ఐఆర్: 87/2008, క్రైం నం: 130/07.
సెక్షన్లు: 304(ఏ), 201, 182
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.

2. ఎఫ్ఐఆర్:: 443/2011, క్రైం నం: 290/10.
సెక్షన్లు: 447, 427 రీడ్ విత్ 34 అండ్ 3(1). 
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.

3. ఎఫ్ఐఆర్:: 166/13, క్రైం నం: 137/10.
సెక్షన్లు: 143, 448,342 
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.

4. ఎఫ్ఐఆర్: 36/2011, క్రైం నం: 90/11.
సెక్షన్లు: 354, 341, 352, 352 రీడ్ విత్ 34 ఈఫ్ఛ్. 
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.

5. క్రైం నం: 218/2011.
సెక్షన్లు: 353, 323, 506(2), 352 రీడ్ విత్ 34 ఈఫ్ఛ్. 
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: దెందులూరు.

6. క్రైం నం: 84/12.
సెక్షన్లు: 341, 323, 324 రీడ్ విత్ 34 ఈఫ్ఛ్. 
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: పెదవేగి..

7. క్రైం నం: 172/12.
సెక్షన్లు: 341, 353, 506(2) రీడ్ విత్ 34 ఈఫ్ఛ్. 
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: పెదవేగి.

8. క్రైం నం: 20/13.
సెక్షన్లు: 341, 323, 324 రీడ్ విత్ 34 ఈఫ్ఛ్ అండ్ సెక్షన్ 11. 
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: పెదవేగి.

9. క్రైం నం: 29/13.
సెక్షన్లు: 341, 332, 353 రీడ్ విత్ 34 ఈఫ్ఛ్ అండ్ సెక్షన్ 3(1) ఎస్సి, ఎస్టీ యాక్ట్. 
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.

10. క్రైం నం: 157/13.
సెక్షన్లు: 403, 406 రీడ్ విత్ 34 ఈఫ్ఛ్.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.

11. క్రైం నం: 160/13.
సెక్షన్లు: 448, 323, 307 రీడ్ విత్ 34 ఈఫ్ఛ్.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.

12. క్రైం నం: 263/13.
సెక్షన్లు: 448, 427, 506 రీడ్ విత్ 34 ఈఫ్ఛ్.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు టు టౌన్.

13. క్రైం నం: 77/14.
సెక్షన్లు: 353 మరియు సెక్షన్ 4 (మెడికల్ సర్వీసెస్ యాక్ట్ 2007)
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు టు టౌన్.

14. క్రైం నం: 80/14.
సెక్షన్లు: 353, 341 171 ఏ, 171-F, 188, 506 మరియు ప్రజా ప్రతినిదుల రక్షణ యాక్ట్ సెక్షన్ 132(1)(2), 132(1)(2) 
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు టు టౌన్.

15. క్రైం నం: 77/14.
సెక్షన్లు: 353 మరియు సెక్షన్ 4 (మెడికల్ సర్వీసెస్ యాక్ట్ 2007)
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు టు టౌన్.

16. ఎఫ్ఐఆర్: 356/07, క్రైం నం: 93/2006.
సెక్షన్లు: 341, 188 రీడ్ విత్ 34 ఈఫ్ఛ్. 
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: గన్నవరం.

17. ఎఫ్ఐఆర్: 467/10, క్రైం నం: 39/2009.
సెక్షన్లు: 309 రీడ్ విత్ 34 ఈఫ్ఛ్.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.

18. ఎఫ్ఐఆర్: 549/10, క్రైం నం: 210/2009.
సెక్షన్లు: 143, 341, రీడ్ విత్ 34 ఈఫ్ఛ్.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: పెదవేగి.

19. ఎఫ్ఐఆర్: 915/2011, క్రైం నం: 46/2011.
సెక్షన్లు: పక్షులు, జంతు హింస, పక్షులతో పందాలు చట్టం 9(2), 11
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.

20. ఎఫ్ఐఆర్: 27/12, క్రైం నం: 100/11.
సెక్షన్లు: 143, 341, 186 రీడ్ విత్ 34 ఈఫ్ఛ్.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు గ్రామీణ.

21. ఎఫ్ఐఆర్: 233/12, క్రైం నం: 161/11.
సెక్షన్లు: 341 రీడ్ విత్ 34 ఈఫ్ఛ్.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: దెందులూరు.

22. ఎఫ్ఐఆర్: 377/13, క్రైం నం: 124/13.
సెక్షన్లు: 143, 341 రీడ్ విత్ 34 ఈఫ్ఛ్ మరియు 7(1)(బ్), 
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: పెదపాడు.

23. క్రైం నం: 159/12.
సెక్షన్లు: 143, 341, 149 రీడ్ విత్ 34 ఈఫ్ఛ్ మరియు 7(1)(బ్), 
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: హనుమాన్ జంక్షన్.

24. సెక్షన్లు: 506, 323, 356 రీడ్ విత్ 34 ఈఫ్ఛ్ మరియు 7(1)(బ్). (ప్రభుత్వ ఉద్యోగి మీద దాడి) 
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: దెందులూరు.

25. సెక్షన్లు: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, ఐపీసీ 323 
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.

26. సెక్షన్లు: 353, 334, 379 (ఎమ్మార్వో వనజాక్షి గారి మీద దాడి) 
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ముసునూరు.

27. సెక్షన్లు: 323, 353,506 (ట్రాఫిక్ పోలీసు మీద దాడి) 
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: దెందులూరు.

28. సెక్షన్లు: 27, 29, 51 వ్యణ్యప్రాణి అభయారణ్య చట్టం-1972 
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: కైకలూరు.

29. హనుమాన్ జంక్షన్లో ఆర్టీసి కండక్టర్, స్తానికుడిని కొట్టిన కేసు

30. తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళల మీద దాడి కేసు.

31. అంగన్ వాడి ఉద్యోగులని దుర్బాషలాడిన కేసు.

దాదాపు మొత్తం 40 కేసులున్నాయి. కేసులు పెట్టని సంఘటనలు వందల్లో ఉంటాయి.ఈసారి సరిగ్గా చిక్కాడు ఇతని అరెస్ట్ కి డిమాండ్ చేద్దాం..." అంటూ రాసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఈ సమాచారం గనక నిజం అయితే మాత్రం ఇంత నేర చరిత్ర ఉన్న ఎమ్మెల్యే మళ్ళీ ఎన్నిక కావటం అంటే ఒక సారి మన ఎన్నికల పద్దతిని పున:సమీక్షించుకోవాలేమో...