"సోషల్ మీడియా వీరులకు" మాజీ సైనికుని భార్య సమాధానం

23:27 - February 16, 2019

*ప్రగల్భాలు పలికేవాళ్లకు ఓ సైనికుడి భార్య సంధిస్తున్న ప్రశ్న

*రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ దివంగత డాక్టర్ గౌతమ్ రవీంద్రనాథ్ సతీమణి

*వీళ్లా ప్రతీకారం గురించి చెప్పేది?

 

 

పుల్వామా ఘటనతో దేశం యావత్తు రగిలిపోతున్న విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన దగ్గరినుంచీ ప్రతీకారం తీర్చుకోవాల్సిందే రక్తానికి రక్తం తో సమాధానం చెప్పాల్సిందే అంటూ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులని చూసిన  రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ దివంగత డాక్టర్ గౌతమ్ రవీంద్రనాథ్ సతీమణి తన కూతురూ, సింగర్ "మానసి స్కాట్‌"కు ఓ మెసేజ్‌ను వాట్సాప్ చేశారు. ఆ సందేశాన్ని యథాతథంగా "My ma has been a proud fauji-wife (and doctor) all her life and she still is though my father - Lt. General Gautam Ravindranath PVSM, VSM, SM - is no more. She sent me this forward today ..."   అంటూ   ట్వీట్ చేశారు. ప్రతీకారం పేరుతో ప్రగల్భాలు పలికేవాళ్లకు ఓ సైనికుడి భార్య సంధిస్తున్న ప్రశ్న అన్నట్టుగా ఉన్న ఈ సందేశానికి మంచి స్పందన వస్తోంది. కనీస శుభ్రత పాటించలేనివాళ్లు, స్త్రీలను గౌరవించలేని వాళ్లు, రూల్స్ బ్రేక్ చేసే వాళ్లు, సరైన నాయకుడిని ఎన్నుకో లేనివాళ్లు... వీళ్లా ప్రతీకారం గురించి చెప్పేది? అంటూ ప్రశ్నించారు. ఆ సందేశం ఇలా సాగింది... 

"ప్రతీకారం కావాలి!" అంటూ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నవారికోసం...
ప్రతీకారం ఎందుకు? మీకోసం ఇంకా కొందమంది ప్రాణాలు పోగొట్టూకోవటానికా? మీరు బహిరంగంగా రోడ్లమీద ఉమ్మేస్తూ, మూత్రవిసర్జన చేస్తున్నందుకా? రూల్స్ ని ఇష్టానుసారం బ్రేక్ చేస్తున్నందుకా? మీకు ఇష్టం వచ్చిన రీతిలో వాహనాలని నడుపుతున్నందుకా? మహిళలని, అమ్మాయిలనీ వెటకారం చేస్తూ మాట్లాడుతున్నందుకా? కులం, మతం, ప్రాంతం అంటూ ఒకరినొకరు ద్వేషించుకుంటూ,ఎలక్షన్లలో మళ్ళీ మళ్ళీ నేరస్తులకు ఓటువేస్తూ మీరు కోరుకున్న వాళ్ళనే పార్టీలు కూడా ఎన్నికల్లో నిలబెడుతున్నందుకా?  
    అసలు మీరు అంటోన్న ఆ ప్రతీకారానికి ఒక అర్థం ఉండాలని గుర్తుంచుకోండి. లేదంటే మీరే ముందు నిలబడి యుద్దం చేసి ప్రతీకారం తీర్చుకోండి. సోదర జవాన్లను కోల్పోయిన వాళ్ళు వారిపని వారు చేస్తారు గానీ వాళ్ళకు ప్రతీకారం తీర్చుకోమని మీరు గుర్తు చేసే అవసరం లేదు...