మంగళగిరిలో జనసేన పోటీ?: పవన్ నిర్ణయం పై సేపీఐ అసంతృప్తి

12:16 - March 25, 2019

*ఒక పక్క పొత్తు అని చెప్తూనే మంగళగిరిలో జనసేన పోటీ 

*జనసేన తరుఫున మంగళగిరిలో చల్లపల్లి శ్రీనివాస్ పోటీ 

*అసహనంలో సీపీఐ అభ్యర్థి నాగేశ్వరరావు

 

 

ఈ సారి ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఏకంగా తన తనయుడు, పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శిగా వున్న నారా లోకేశ్‌ను మంగళగిరి అభ్యర్థిగా బరిలోకి దించా రు. టీడీపీ ప్రత్యరిఽ్ధగా వైసీపికి చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ బరిలో వున్నారు. జనసేన మాత్రం పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని సీపీఐకు కేటాయించగా, ఆ పార్టీ తరపున రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పోటీచేస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ తరపున షేక్‌ సలీం పోటీ చేస్తున్నారు.

అయితే ఇప్పుడు సీపీఐ తరుఫున ముప్పాళ్ల నాగేశ్వరారావు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతుండగా. అనూహ్యంగా పవన్ జనసేన తరుఫున చల్లపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తిని మంగళగిరి బరిలో దింపింది. ఆయనకు సోమవారం భీఫాం కూడా పవన్ అందజేశారు. సోమవారం చివరి రోజు కావడంతో నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు. ఒక పక్క పొత్తు అని చెప్పి మరీ తమ అభ్యర్థిని రంగంలోకి దించటంతో సీపీఐ వర్గాల్లో పవన్ నిర్ణయం పట్ల అసంతృప్తి నెలకొంది. 

జనసేన ఈ ఎన్నికల్లో వామపక్షాలు - బీఎస్పీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా టీడీపీ కీలక నేతలున్న నియోజకవర్గాలను సీపీఐకి ఇచ్చి టీడీపీకి సహకరిస్తుందన్న విమర్శలు వచ్చాయి. ప్రతిపక్ష జగన్ అయితే చంద్రబాబు పార్ట్ నర్ పవన్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో జనాల దృష్టిలో డ్యామేజ్ కాకుండా ఉండేందుకు పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.

 నిజానికి మొదటినుంచీ మంగళ గిరి  కమ్యూనిస్టులకు కంచుకోట. మంగళగిరి అసెంబ్లీకి కమ్యూనిస్టులు నాలుగు పర్యాయాలు ఎన్నికయ్యారంటే వీరి ప్రాబల్యం ఇక్కడ ఏ స్థాయిలో వుండేదో అవగతమవుతుంది. 1982కు ముందు ఇక్కడి అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల మధ్య పోరు తీవ్రస్థాయిలో వుండేది. 1989 ఎన్నికల నాటి నుంచి టీడీపీ అధిష్ఠానం పొత్తుల్లో భాగంగా మంగళగిరిని సీపీఎం, బీజేపీ, సీ పీఐలకు కేటాయిస్తూ వచ్చింది.  కాగా పవన్ అనూహ్య నిర్ణయం సీపీఐకి  షాక్ ఇచ్చినట్టైంది. సీపీఐ అభ్యర్థి నాగేశ్వరరావు దీనిపై ఫైర్ అవుతున్నారు. ఇలా తమకు కేటాయించిన స్థానాల్లో అభ్యర్థులను దింపడంపై సీపీఐ నేతలు పవన్ తో తేల్చుకోవడానికి రెడీ అయ్యారు.