ప్రభాస్ ఎవరో నాకు తెలియదు, ఈ ప్రచారం ఆపండి: తెలంగాణాలో ఫిర్యాదు చేసిన షర్మిల

15:23 - January 14, 2019

సోషల్‌మీడియాలో తనపై జరుగుతున్న అసత్య ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల ఈరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌ కి ఫిర్యాదు చేశారు. సినీ హీరో ప్రభాస్‌తో తనకు సంబంధం ఉందని ఆరోపిస్తూ జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పేరుతో సోషల్ మీడియాలో తనపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

మీడియా ముఖంగా ఆమె మాట్లాడుతూ.. 'ఐదేళ్ల క్రితం మొదలైన ఈ దుష్ప్రచారం.. ఇప్పుడు మళ్ళీ మొదలైందని' వాపోయిన షర్మిల. అసలు ప్రభాస్ అనే వ్యక్తిని తన జీవితంలో ఎప్పుడూ కలవలేదని చెప్పారు. షర్మిళ వెంట ఆమె భర్త బ్రదర్ అనిల్‌కుమార్, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, వాసిరెడ్డి పద్మ తదితరులు ఉన్నారు. ఆ తర్వాత షర్మిళ మీడియాతో మాట్లాడుతూ ప్రభాస్ అనే వ్యక్తిని తన జీవితంలో ఎన్నడూ చూడలేదని, కలవలేదని తెలిపారు. ఈ ప్రచారం వెనుక తెలుగుదేశం పార్టీ ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేకనే హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు షర్మిళ తెలిపారు. 

‘2014 ఎన్నికలకు ముందుకు తనకు సినీ హీరో ప్రభాస్‌తో తనకు సంబంధం ఉందని ఓ వర్గం ప్రచారం చేసింది. దీనిపై అప్పట్లో నేను పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కొందరిపై చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో ఆ ప్రచారాన్ని మళ్లీ ప్రారంభించారు. ఇలాంటి రాతలు ఇంకెంతో మంది మహిళలపైనా రాస్తున్నారు. అందుకే వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో ఇలాంటి రాతలకు చరమగీతం పాడేలా ఏకం కావాలని ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ నేతలు, విలేకరులు, మహిళా సంఘాలను కోరుతున్నాను’ అని చెప్పిన షర్మిల. 
  తనకు హీరో ప్రభాస్ తో సంబంధం వుందంటూ గతంలో 2014 ఎన్నికల సందర్భంతో మొదట ప్రచారం మొదలు పెట్టారని షర్మిల తెలిపారు. అయితే  మధ్యలో  ఈ ప్రచారాన్ని నిలిపివేసి తాజాగా మళ్లీ ఎన్నికలు వస్తున్నయి కాబట్టి మరోసారి సోసల్ మీడియాలో ఈ ప్రచారాన్ని ఉదృతం చేశారన్నారు.