హిందీ అర్జున్ రెడ్డి న్యూ లుక్ : అదిరిపోయింది

16:54 - January 14, 2019

మామూలుగా సాగిపోతున్న టాలీవుడ్ లో చిన్న పాటి కుదుపు తీసుకు వచ్చిన సినిమా అర్జున్ రెడ్డి. ఓవర్ నైట్ లో విజయ్ దేవరకొండకి స్టార్ స్టేటస్ తీసుకు వచ్చిన సినిమా. పెళ్ళి చూపులు తర్వాత అప్పుడప్పుడే జనాల మైండ్ లో రిజిస్టర్ అవుతున్న విజయ్ ని అమాంతం ఒక స్టార్ ని చేసిన సినిమా. అర్జున్ రెడ్డి. తెలుగులో హిట్టైన ఈ మూవీని అన్ని భాషల్లో రీమేక్ చేస్తున్నారు.

ఇప్పటికే తమిళంలో విక్రమ్ కొడుకు ధృవ్.‘వర్మ’ టైటిల్‌తో తమిళంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడులైన ‘వర్మ’ ఫస్ట్ ‌లుక్‌, టీజర్లకు యావరెజ్ అన్న రెస్పాన్సే తప్ప పెద్దగా టాక్ ఏమీ కనిపించలేదు. మరోవైపు కన్నడ,మలయాళ వెర్షన్‌లో ఈ మూవీని రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. 
 ఇక హిందీ లో షాహిద్ కపూర్ హీరోగా "కబీర్ సింగ్" పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగానే ఈ మూవీని హిందీలో తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని వచ్చే యేడాది జూన్ 21న రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ హిందీ వెర్షన్‌కు ‘కబీర్ సింగ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

'అర్జున్ రెడ్డి' లో విజయ్ దేవరకొండ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించిన సంగతి తెలిసిందే.  మెడికల్ స్టూడెంట్ గా స్టైలిష్ లుక్ లోనూ లవ్ ఫెయిల్యూర్ అయిన సమయంలో జుట్టుతో పాటు గడ్డం మీసాలు పెంచి ఒక రఫ్ లుక్ లో నూ కన్పించాడు.  ఇప్పటికే రీమేక్ లో షాహిద్ గడ్డం లుక్ బయటకు వచ్చింది.  తాజాగా షాహిద్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసిన ఫోటోలో కాలేజి స్టూడెంట్ లుక్ లో ఉన్నాడు. గడ్డం తీసేశాడు.. షార్ట్ హెయిర్ తో ఉన్నాడు.   బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో రాయల్ ఎన్ఫీల్డ్ బైకుపై స్టైల్ గా కూర్చున్నాడు. జీన్స్ ప్యాంట్..  టీ-షర్ట్.. పైనేమో జాకెట్.. కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ తో ఫుల్ గా రఫ్ అండ్  రౌడీ యాటిట్యూడ్ కనిపిస్తోంది.  


   తమిళ రీమేక్ ని బాలా డైరెక్ట్ చేస్తున్నా బయటకి వచ్చిన టీజర్ మీద కూడా పెద్ద చర్చ ఏమీ జరగ లేదు. నిజానికి అర్జున్ రెడ్డి పాత్ర అయిన "వర్మ" గా దృవ్ పెద్దగా అకట్టుకోలేకపోయాడు. కానీ బాలీవుడ్ లో మాత్రం షాహిద్ కి మంచి రెస్పాన్సే ఉంది.  పైగా ఒరిజినల్ సినిమా దర్శకుడే రీమేక్ కు డైరెక్టర్ కావడంతో హిందీ వెర్షన్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి.