దుమ్ము దులిపిన నైట్ రైడర్స్: సన్ రైజర్స్ పై కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘన విజయం

20:54 - March 24, 2019

*ఐపీఎల్  (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 12వ సీజన్‌

*సన్ రైజర్స్ పై కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘన విజయం

*19.4 ఓవర్లలో టార్గెట్‌ని ఛేదించి, ఆరు వికెట్ల తేడాతో

 

ఐపీఎల్  (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 12వ సీజన్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న రెండో లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన నైట్ రైదర్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవటంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. 
       ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్గా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈరోజు జరుగుతున్న తొలి మ్యాచ్‌లో అడుగుపెట్టిన వార్నర్ కేవలం 31 బంతుల్లోనే 8X4, 1X6 సాయంతో 50 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కతాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. షకీబ్ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి క్రిస్ లిన్(7) రషీద్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఈ దశలో బ్యాటింగ్‌కి వచ్చిన రాబిన్ ఊతప్పతో కలిసి నితీశ్ రాణా జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కి 80 పరుగులు జోడించారు. 47 బంతుల్లో 68 పరుగులు చేసిన నితీశ్ రానా 118 పరుగుల వద్ద ళ్భ్వ్గా వెనుదిరిగాడు.ఈ క్రమంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ కష్టాల్లో పడింది.ఆ తర్వాత వచ్చిన ఆండ్రీ రస్సెల్ దుమ్ముదులిపాడు.19 బంతుల్లో 49 పరుగులు చేశాడు.19.4 ఓవర్లలో టార్గెట్‌ని ఛేదించి, ఆరు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై నైట్‌రైడర్స్ విజయం సాధించారు. ఆఖర్లో అండ్రూ రస్సెల్ (19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు)లతో సన్‌రైజర్స్‌కి చుక్కలు చూపించాడు. ఫలితంగా కోల్‌కతా ఇంకో రెండు బంతులు మిగిలి ఉండగానే.. 183 పరుగులు చేసి మ్యాచ్‌ని కైవసం చేసుకుంది.