వినయ విధేయ బోయపాటి: సినిమా నుంచి ఆ సీన్ తీసేసారట

14:29 - January 13, 2019

కమర్షియల్ తెలుగు సినిమా అనగానే అది యాక్షన్ ఫార్ములా అనేరోజులు పోయాయి. కొత్త కొత్త ఆలోచనలతో టాలీవుడ్ లోకి వస్తున్న కుర్రాళ్ళంతా "ఘాజీ" నీదీనాదీ ఒకే కథ" అర్జున్ రెడ్డి" కేరాఫ్ కంచర పాళెం" లాంటి సినిమాలతో కొత్త తరాన్ని ఉర్రూతలూగిస్తూంటే. ఒకప్పుడు అగ్రదర్షకుల స్థాయిలోఉన్న వాళ్ళు మాత్రం ఇంకా ఆ పాత ఫైటింగుల ఫార్ములాని నే పట్టుకుని అవే పాత కాన్సెప్ట్ కథలనే తీస్తున్నారు. నిజానికి ఒకప్పుడు మాస్ ప్రేక్షకులకి హీరోలు చేసే విన్యాసాలు బాగా నచ్చేవి. ఆ తరహా పాత్రలు చేసే వింత వేశాలని బాగా ఇష్టపడ్దారు కూడా. తొడకొట్టి ఒక్క కత్తితో పది తలలని నరికి పారెయ్యటం, దెబ్బకొడితే కిందపడ్డ మనిషి బాడీ రబ్బర్ బాల్ లా పైకి బౌన్స్ అవ్వటం దగ్గరనుంచీ తొడగొట్టి వేలు చూపిస్తే ఏకంగా రైలే వెళ్ళిపోవటం వంటివి కూడా బాగా పాపులర్ అయ్యాయి. 
     ఇక ఒకప్పుడు రజినీకాంత్ సినిమాల్లో కూడా ఉండే ఇల్లాజికల్ స్టంట్స్ కి కూడా ఈలలు వేసిన తరం ఇప్పుడు మారిపోయింది. ఎంత సినిమా అయినా మరీ ఏదో అతీంద్రియ శక్తులున్నట్టుగా ఉండే హీరోలనీ, లాజిక్ లేని స్టంట్స్ నీ పట్టించుకోవటం మానేసారు జనం. నిజానికి ఇవే స్టంట్స్ చేసిన బాలయ్య కూడా ఒక ఇంటర్వ్యూలో తాను చేసిన ఈ ఇల్లాజికల్ సీన్స్ చూసుకొని నవుకున్నానని నిజాయితీగా చెప్పేసి మరీ నవ్వారు. ఏమాత్రం భేషజం లేకుందా అవన్నీ పిచ్చి సీన్లు అంటూ ఒప్పుకున్నారు. కానీ ఇటు ప్రేక్షకులూ, అటు నటులూ మారుతున్న కొందరు దర్శకులు మాత్రం ఇంకా అక్కడే ఉంది పోయారు. 
    ఈ క్రమం లోనే ఈ ఏడాది సంక్రాంతి రేసులో వచ్చిన రామ్ చరణ్ కొత్త సినిమా "వినయ విధేయ రామా" లో ఉన్న ఇలాంటి లాజిక్ లేని సీన్లని చూసి ఆ హీరోఇజానికి వెర్రెత్తిపోతారనుకున్న జనం రివర్స్ హ్యామరింగ్ మొదలు పెట్టేసరికి ఖంగు తిన్నాడు డైరెక్తర్ బోఅయపాటి. దాంతో జనమంతా నవ్వుతున్న అలాంటి సీన్ ని సినిమానుంచే తొలగించేసారట. 
       ఈ సినిమాలో విల‌న్ చేతిలో చిక్కుకున్న అన్న‌య్య భువన్ కుమార్ (ప్ర‌శాంత్‌) ఫోన్ చేస్తే ఎయిర్ పోర్ట్ అద్దాన్ని బ‌ద్ద‌లు కొట్టుకుని రామ్‌చ‌ర‌ణ్ ప‌రుగు ప్రారంభిస్తాడు. ఓ బ్రిడ్జి మీద నుంచి రైలు మీద‌కు దూకేసి వైజాగ్ నుంచి నేపాల్ బోర్డ‌ర్ వ‌ర‌కు అలాగే నిల్చుని వెళ్లిపోతాడు. ఈ సీన్ సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్‌కు గుర‌వుతోంది. ఎంత మాస్ సినిమా అయితే మాత్రం మ‌రీ ఇలాంటి సీన్లు తీస్తారా అంటూ నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. ఈ సీన్‌పై సెటైర్లు వేస్తూ వెరైటీ పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో ఈ సీన్‌ను చిత్ర‌బృందం సినిమా నుంచి తొలగించింది. తప్పదు కదా ప్రేక్షకుడు ఒప్పుకున్నంత వరకే ఏ సినిమా అయినా నిలబడేఅది.