ఇక కార్డు లేకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చట!

12:58 - March 16, 2019

గతంలో బ్యాంకులో డబ్బులు కావాలంటే బుక్కులు తీసుకోని బ్యాంకు వరకూ వెల్లి డబ్బులు తీసుకునేది. తరువాత ఎటిఎంలు వచ్చాక బ్యాంకులుకు వెల్లకుండానే కార్డు ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు డెబిట్‌ కార్డు లేకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చట. నిజమేనండీ....వివరాల్లోకి వెలితే...అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ మరో అధునాత సదుపాయాన్ని తీసుకువచ్చింది. డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎంల నుంచి నగదు పొందే సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న యోనో ఎస్బీఐ యాప్‌లో ' యోనో క్యాష్ ' అనే ప్రత్యేక ఆప్షన్‌ను పొందుపరచింది.  ఈ కార్డ్ లెస్ ఆప్షన్ వల్ల ముఖ్యంగా కార్డు క్లోనింగ్, స్కిమ్మింగ్ వంటి మోసాల నుంచి బయటపడవచ్చు.

యోనో యాప్‌ని ఎలా వాడలో చూడండి...

•    డెబిట్ కార్డు లేకుండా నగదును పొందాలంటే మీ వద్ద స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిందే. అందులో యోనో ఎస్బీఐ(YONO SBI)యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని రిజిస్టర్ అవ్వాలి. ఆల్రెడీ యోనో ఎస్బీఐ యాప్ వాడుతున్న వాళ్లు అప్‌డేట్ చేసుకుంటే సరిపోతుంది. 

•    యాప్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యాక కింది భాగంలో క్విక్ లింక్స్ అనే కేటగిరీ ఉంటుంది. అందులో మూడో ఆప్షన్‌గా ' యోనో క్యాష్ ' ఉంటుంది.
•    యోనో క్యాష్‌పై క్లిక్ చేస్తే ' రిక్వెస్ట్ యోనో క్యాష్ ' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీ మొబైల్ నంబర్‌పై లింక్‌ అయి ఉన్న ఎస్బీఐ ఖాతాలను చూపిస్తుంది. అందులో సంబంధిత ఖాతాను ఎంచుకుని, దాని కింది భాగంలో డ్రా చేయాల్సిన అమౌంట్‌ను ఎంటర్ చేసి నెక్ట్స్ అనే బటన్‌ను క్లిక్ చేయాలి.
•    అనంతరం 6 అంకెల పిన్‌ను ఎంటర్ చేసి మళ్లీ నెక్ట్స్ అనే బటన్‌ను ప్రెస్ చేయాలి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అంగీకరించి కన్ఫర్మ్ బటన్‌పై క్లిక్ చేయాలి. మనం కన్ఫర్మ్ చేసిన వెంటనే రిజిస్టర్డ్ మొబైల్‌ నంబర్‌కు ట్రాన్సాక్షన్ నంబర్, ఓటీపీ ఎస్సెమ్మెస్ ద్వారా వస్తాయి. ఆ రెండింటినీ ఉపయోగించి 30 నిమిషాల్లోపు ట్రాన్సాక్షన్‌ను పూర్తి చేయాలి.
•    సింగిల్ ట్రాన్సాక్షన్‌లో గరిష్టంగా రూ. 10 వేలు, అదే రోజులో అయితే రూ. 20 వేలు మాత్రమే విత్‌డ్రా చేయవచ్చు.

' యోనో క్యాష్ ' అనే ఆప్షన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 16,500 కు పైగా ఎస్‌బీఐ ఏటీఎంల్లో కార్డు లేకుండానే నగదు ఉపసంహరణ చేయొచ్చని ఎస్బీఐ చైర్మన్ రజ్నిష్ కుమార్ తెలిపారు. రానున్న కాలంలో మొత్తం 60 వేల ఏటీఎంల్లోనూ ఈ సదుపాయాన్ని తీసుకొస్తామని ఆయన చెప్పారు.