పాప్‌కార్న్‌ తింటూ ఎంజాయ్ చేయండి: రాధారవి వ్యాఖ్యలకు సమంతా కౌంటర్

11:39 - March 26, 2019

*తమిళ నటుడు రాధారవిపై కొనసాగుతున్న నిరసన 

*నడిగరసంఘం, డీఎంకే పార్టీల సస్పెన్షన్ వేటు 

*నయనతార కొత్త సినిమా టికెట్లు పంపిస్తా అంటూ సమంతా కౌంటర్ 

 

"నయనతార మంచి నటి. ఇంతకాలంగా సినీరంగంలో నాయకిగా కొనసాగడం పెద్ద విషయమే. అయితే ఆమె గురించి ప్రచారం కాని వార్తలే లేవు. అవన్నీ అధిగమించి నిలబడింది. తమిళ ప్రజలు ఎప్పుడూ ఒక విషయాన్ని నాలుగైదు రోజులే గుర్తుంచుకుంటారు. ఆ తరువాత మరచిపోతారు. నయనతార ఒక చిత్రంలో దెయ్యంగానూ నటించింది. మరో చిత్రంలో సీతగానూ నటించింది. ఇప్పుడు సీతగా ఎవరైనా నటించవచ్చు. ఇంతకుముందు అయితే సీతగా నటించడానికి కేఆర్‌ విజయనే ఎంపిక చేసుకునేవారు. ఇప్పుడు చూడగానే నమస్కరించాలనే వారు నటించవచ్చు, చూడగానే పిలివాలనిపించే వారు నటించవచ్చు. నయనతారను చూస్తే దెయ్యాలు పారిపోతాయి" అంటూ నటి నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళ నటుడు రాధారవి పై విమర్శల వెల్లువ ఇంకా ఆగటం లేదు.

ఆయన వ్యాఖ్యలని తీవ్రంగా పరిగణించిన డీఎంకే పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. రాధారవి డీఎంకే తరపున ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. దాంతో పాటు ఆయన్ని సినిమాల్లో నటించకూడదంటూ నడిగర్ సంఘం సస్పెక్షన్ వేటు వేసింది. ఆయన్ని ఇక ముందు ఎలాంటి సినిమాల్లో తీసుకోకూడదంటూ తీర్మానం చేసింది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వెంటనే కోలీవుడ్ నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

‘‘సినిమా ప్రమోషన్లలో పాల్గొనమని నటీనటుల మధ్య అగ్రిమెంట్‌ కుదుర్చుకోమని "మది" కి చెప్పాను. అలాగే షూటింగ్‌లో భాగంగా హీరోయిన్‌ను హీరో ఎక్కడైనా తాకుతాడు. ఆ విషయంలో మళ్లీ సినిమా తర్వాత గొడవ చేయకూడదు అనే అగ్రిమెంట్‌ కూడా ఉండాలి’’ అంటూ మీటూ ఉధ్యమాన్ని కూడా కలుపుకొని మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేయటంతో సినీ పరిశ్రమకూడా మండిపడింది. 
        రాధారవి వ్యాఖ్యలను గాయని చిన్మయి, నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ తీవ్రంగా ఖండించారు. అలాగే రాధారవి వ్యాఖ్యలను సోదరి నటి రాధిక శరత్‌కుమార్‌ ఖండించడం విశేషం. కొలైయుధీర్‌ కాలం చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో రాధారవి మాట్లాడిన వీడియోను నేను పూర్తిగా చూడలేదుగాని, నయనతార గురించి తను చేసిన వ్యాఖ్యలు సరికాదని రాధిక తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరోవైపు రాధారవి వ్యాఖ్యలను  నడిగర్ సంఘం కూడా తప్పుబట్టింది. అయితే ఆయన మాత్రం తానేమీ తప్పుగా మాట్లాడలేదని వివరణ ఇచ్చినా... వివాదం మాత్రం సద్దుమణగలేదు.
"ఇలాంటి కార్యక్రమాలకు పని పాటా లేని వారు వచ్చి అనవసర ప్రసంగం చేస్తుంటారు. ఇలా ఏం జరిగినా వారిపై ఏ సంఘం  చర్యలు చేపట్టేది లేదు. అందుకే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనరాదని నిర్ణయించుకున్నాం.’అంటూ చెప్పేశడు దర్శకుడు విగ్నేశ్ శివన్. ఇప్పుడు రాధా రవి వ్యాఖ్యలకు తాజాగా సమంతా కూడా కౌటర్ ఇచ్చింది. ‘‘మిస్టర్ రాధారవి.. కష్టం ఎప్పటికీ అలాగే నిలిచి ఉంటుంది. మీ బాధ చూసి మేము తట్టుకోలేకపోతున్నాం. మీకు ప్రశాంతత లభించాలని కోరుకుంటున్నాం. నయనతార తర్వాతి సూపర్‌హిట్‌ సినిమా టికెట్లు మీకు కొనిస్తాం. పాప్‌కార్న్‌ తింటూ ఎంజాయ్ చేయండి’’ అని పేర్కొంటూ ట్వీట్ చేసింది .